ఏడేళ్ల చిన్నోడు కిలిమంజారోను అధిరోహించాడు

samanyuసాహసం చేయడానికి…రికార్డులు బ్రేక్ చేయడానికి వయసుతో అవసరం లేదని నిరూపించాడు ఏడేళ్ల సమన్యు యాదవ్. ఈ చిన్నోడు  కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. కర్నూలు బాలాజీనగర్‌కు చెందిన లావణ్య, కృష్ణకాంత్‌ దంపతులు. కృష్ణకాంత్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగి కాగా లావణ్య గృహిణి. వీరికి హసిత, సమన్యుయాదవ్‌ సంతానం.

సమన్యు సికింద్రాబాద్‌లోని బోల్టన్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. హసిత మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపునకు వెళ్లేందుకు ఫిట్‌నెస్‌ పరీక్షలో ఎంపికైంది. హసిత ట్రైనింగ్ కు వెళుతుంటే ఆమెతో పాటు అక్కడికి వెళ్లిన సమన్యు ట్రెక్కింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. తాను కూడా ఎవరెస్టు ఎక్కడానికి వెళతానని పట్టుపట్టడంతో నిపుణులు సమన్యు ఫిట్‌నెస్‌ను పరీక్షించారు. మిగతావారి కన్నా సమన్యు అతివేగంగా వ్యాయామాలు చేస్తుండటాన్ని గమనించిన ఫిట్‌నెస్‌ నిపుణులు ఈ బుడతడి ఉత్సాహాన్ని చూసి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపు వెళ్లడానికి అనుమతినిచ్చారు. 45 రోజుల శిక్షణ తర్వాత సమన్యు సాహసయాత్రకు బయలుదేరి మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించాడు.

మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించిన స్ఫూర్తితోనే సమన్యు కిలిమంజారో పర్వతారోహణకు గత నెల 17న హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 29న కిలిమంజారోను అధిరోహించడం ఆరంభించాడు. ఈనెల 2న ఉదయం 11:52 గంటలకు (5,380 మీటర్ల) లక్ష్యాన్ని పూర్తి చేసి గిన్నిస్‌బుక్‌ రికార్డు నెలకొల్పాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy