ఏదీ బేటీ బచావ్: ఆడపిల్లలు పుట్టారని భార్యను చంపేశాడు

abn-photoబేటీ బచావ్.. అంటూ అరిచిమొత్తుకున్నా… ఇంకా లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోదారుణం బయటపడింది. ఆడపిల్లలు పుట్టారని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా చంపేశాడు AR కానిస్టేబుల్‌.  ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా హన్మకొండ రాంనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపెల్లికి చెందిన రాధిక (23), యాకయ్య ప్రేమించుకున్నారు. 2013లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వారిద్దరు రాంనగర్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. దీంతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం ఉదయం ఇంట్లో రాధికను హతమార్చాడు. దీన్ని సహజమరణంగా చూపేందుకు ప్రయత్నించాడు. అనార్యోగంతో ఉందని నమ్మించేందుకు.. అంబులెన్స్ కు ఫోన్ చేసి…  అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించాలని చూశాడు. అయితే పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు యాకయ్య. పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy