ఏనుగుతో ఆటలా : బాహుబలి స్టంట్ చేస్తే.. కోమాలోకి వెళ్లాడు

bahubaliబాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ లా ఏనుగుపై ఎక్కి పోజుకొట్టాలనుకున్నాడు ఓ వ్యక్తి. కానీ సీన్ రివర్స్ కావడంతో ఆసుపత్రిపాలయ్యాడు.  కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కరిమన్నూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్లో వైరల్‌గా మారింది. కరిమన్నూర్‌కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. దారిలో రబ్బర్‌ ఎస్టేట్‌ వద్ద ఆకులు తింటూ ఓ ఏనుగు కనిపించింది. స్నేహితులు ఇద్దరు వాహనం పక్కన పెట్టి ఏనుగు దగ్గరికి వచ్చారు. ఏనుగుతో ఉన్న దృశ్యాల్ని ఫేస్‌బుక్‌ లైవ్‌లో పెట్టాలని భావించారు. లుంగీ, తెల్ల చొక్కా వేసుకుని ఉన్న వ్యక్తి ఏనుగుకు అరటిపండ్లు పెట్టి మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించాడు. తన దగ్గర ఉన్న పండ్లన్నీ ఏనుగుకు తినిపించాడు. చివరగా దాని తొండానికి ముద్దు పెట్టాడు. ఏనుగు ఏ మాత్రం అడ్డుచెప్పలేదు.

దీంతో అతను దాని తొండం ఎక్కడానికి ప్రయత్నించాడు. దూరంగా నిల్చుని దీన్ని ఫేస్‌బుక్‌ లైవ్‌లో చూపిస్తున్న అతడి స్నేహితుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ‘అలా చేయొద్దు, నువ్వు తాగి ఉన్నావు. ఏనుగు నీపై దాడి చేస్తుంది’ అని అన్నాడు. అయినా సరే ఆ వ్యక్తి వినలేదు. ఏనుగు తొండంపై కాలు పెట్టడానికి ప్రయత్నించాడు. దీంతో ఏనుగు అతడ్ని ఒక్కసారిగా తొండంతో పక్కకు లాగి పడేసింది. కిందపడ్డ అతను స్పృహ కోల్పోయాడు. ఆదివారం (నవంబర్-12) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వీడియోలోని వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు చెప్పారు.

https://youtu.be/CG03SHZ8wQc

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy