
ఇక ఏపీ టీడీపీ నేతలు కూడా కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. వైజాగ్ లో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వినూత్నంగా నిరసన తెలిపారు. కాషాయ వస్త్రాలు, పాకోళ్లు, చేతిలో దండం ధరించి బీజేపీ ఆఫీస్ లో వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు విపక్షాల బంద్ పిలుపును తప్పుబడుతోంది అధికార టీడీపీ. బంద్ తో వచ్చేదేమీ లేదంటున్నారు తమ్ముళ్లు. అనవసర బంద్ లతో జనాన్ని ఇబ్బందులు పెట్టొద్దని చెబుతున్నారు.
రేపటి బంద్ ను సక్సెస్ చేసేందుకు వైసీపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే…. టీడీపీ మాత్రం ఢిల్లీలోనే నిరసనలు కంటిన్యూ చేయాలని డిసైడైంది.