ఏపీని కరప్షన్ ఆంధ్రాగా మార్చారు: పవన్ కల్యాణ్

pavankalyan

సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ను సీఎం చంద్రబాబు కరప్షన్ ఆంధ్రా చేశారన్నారు. గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీలో జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. మీ కొడుకు లోకేష్ అవినీతి  మీ దృష్టికి వచ్చిందా లేదా అని సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు. అంతే కాదు తెలిసే లోకేష్ తో కరప్షన్ చేయిస్తున్నారా అని అన్నారు. కరప్షన్ చేస్తామని బహిరంగంగా చెబుతున్నారట. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఫేస్ చేయాలంటే డబ్బులు కావాలని లోకేష్ అంటున్నారట. ఇంత అవినీతి ఏమిటి అని ప్రశ్నించారు. మీరు చేస్తున్న దోపిడీ చూస్తూ ఊరుకోవడానికేనా  మీకు 2014 లో మీకు మద్దతు ఇచ్చిందన్నారు. మీరు ఇలాగే చేస్తే 2019 లో కొత్త నాయకులను ప్రజలు ఎన్నుకుంటారన్నారు. భారత దేశంలో ఎక్కడ లేని కరప్షన్  ఏపీలో లో ఉందన్నారు. మన డబ్బును దోచుకునే వారిని ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టాలన్నారు. అంతే కాదు .. 2019 లో మీకెందుకు సపోర్టు చేయాలి అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలు మీకైతే అంత సుఖంగా ఉండన్నారు.

నా నేల, మాతృభూమి కోసం చావడానికైనా సిద్దంగా ఉన్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.జనసేన ఉన్నది జనం కోసమేనన్నారు. ఇసుక మాఫియాకు అమ్ముడు పోయిన మిమ్మళ్లి ఇక నుంచి రోజూ నిలదీస్తామన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు మహిళా ఎమ్మార్వోపై .. ఎమ్మెల్యేపై దాడి చేస్తే ఆ దాడి చేసిన ఎమ్మెల్యేను వెనకేసుకొస్తారా అని ప్రశ్నించారు. సింగపూర్ లాంటి రాజధాని కడతానంటున్న సీఎంగారూ…సిగపూర్ లాంటి పాలన కూడా కావాలన్నారు మహిళా అధికారిపై దాడి జరిగితే సింగపూర్ లో అయితే లాఠీలతో తోలు ఊడిపోయేలా కొడతారన్నారు. అవినీతికి ఆస్కారమేలేని పాలన సింగపూర్ లో ఉందన్నారు.

ఓటుకు నోటు ఆరోపణలు వచ్చినప్పుడు ఏం మాట్లాడలేదని నన్ను తిట్టారన్నారు. ఇప్పటికీ మీ బుద్ది, మీ పద్దతులు మారలేదన్నారు. శేఖర్ రెడ్డి కేసులో మీ అబ్బాయి పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయని.. అది మీకు కనిపించడం లేదా అని అన్నారు. లోకేష్ పై వచ్చిన ఆరోపణల కారణంగానే మీకు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అనుకుంటున్నారన్నారు. వైసీపీ వస్తే అవినీతి పెరుగుతుందన్న  మీరు..ఇప్పుడు చేస్తున్నదేంటని పవన్  ప్రశ్నించారు. గాలి జనార్ధన్ రెడ్డి చేసింది తప్పయితే .. ఇసుక మాఫియాదీ తప్పేనన్నారు.

కబ్జాల సంస్కృతిని విశాఖపట్నానికి తీసుకువచ్చారని ఆరోపించారు పవన్.  రాష్ట్రంలో అన్ని పథకాలకూ చంద్రన్నగారి పేర్లేనా డొక్కా సుబ్బమ్మ, సంజీవయ్య వంటి వారి పేర్లు పెట్టొచ్చుకదా అని ప్రశ్నించారు.

మాది చేతకాని తనం  కాదని..మేం సహనంతో ఉన్నామన్నారు. మా సహనం నశించేలా మీరు వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి ఉందన్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు నుంచి జనసేన పార్టీ..జన సైనికుల నుంచి పోరాటం తప్పదని హెచ్చరించారు పవన్ కల్యాణ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy