ఏపీలో వాహనాలకు ఒకే సిరీస్ నంబర్లు.. ఇకపై AP39 మాత్రమే

విజయవాడ, వెలుగు: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకే సిరీస్ నంబర్ కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోనే మొదటిసారి ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో అమలులోకి తీసుకురానుంది. ఇకపై అన్ని జిల్లాల్లోనూ వాహనాలకు ఒకే సిరీస్‌‌ నంబర్ ఉంటుంది. దీంతో వాహనాన్ని ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వీలు కలుగనుంది. ఏపీ 39 సిరీస్‌‌తో కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ విధానంతో రవాణా శాఖకు ఎక్కువ ఆదాయం వస్తుందని, వాహనదారులకు సమయంతోపాటు డబ్బు ఆదా అవుతుందని ఏపీ రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy