ఏపీ ఎంసెట్ లో తెలంగాణ జయకేతనం

ap-eamcetఎంపీ ఎంసెట్ లో సత్తాచాటారు తెలంగాణ విద్యార్థులు. ఇంజనీరింగ్‌ విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్‌–10లో ఐదు ర్యాంకులు రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. ఇక అగ్రికల్చరల్‌ /ఫార్మా స్ట్రీమ్‌లోనూ టాప్‌–10లో ముగ్గురు రాష్ట్ర విద్యార్థులు నిలిచారు. మొత్తంగా ఏపీ ఎంసెట్‌లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌ – 10 ర్యాంకులతోపాటు అగ్రికల్చరల్‌/ఫార్మా విభాగంలో టాప్‌–10లో ఐదు ర్యాంకులను బాలురే కైవసం చేసుకున్నారు. ఏపీ ఎంసెట్‌ ఫలితాలను శుక్రవారం విజయవాడలో ఆ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, ఎంసెట్‌ చైర్మన్‌ కుమార్‌ తదితరులు విడుదల చేశారు.

ఏపీ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో రాష్ట్రం నుంచి 17,356 మంది పరీక్ష రాయగా.. 15,216 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రి కల్చరల్‌/ఫార్మాలో 9,814 మంది పరీక్ష రాయగా.. 9,419 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన విద్యార్థి వి.మోహన్‌ అభ్యాస్‌ 153.935 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. ఖమ్మం జిల్లా కొత్తగూ డేనికి చెందిన అవ్వారి సాయి ఎస్‌ఎస్‌వీ భరద్వాజ్, ఐదో ర్యాంకును హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన వి.వెంకట షణ్ముఖ సాయి, ఆరో ర్యాంకును హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన కోటగిరి వెంకట నిఖిల్, 9వ ర్యాంకును మాదాపూర్‌ కావూరిహిల్స్‌కు చెందిన డి.వరుణ్‌తేజ దక్కించుకున్నారు. ఇక అగ్రికల్చరల్‌/ఫార్మా విభాగంలో కూకట్‌పల్లికి చెందిన సాదినేని నిఖిల్‌చౌదరి 4వ ర్యాంకు, కరీంనగర్‌కు చెందిన కల్యాణ్‌ 8వ ర్యాంకు, మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌కు చెందిన పట్లోళ్ల అఖిల 10వ ర్యాంకు దక్కించుకున్నారు.

మే 12 నుంచి ర్యాంకు కార్డులు

అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. www. sche. ap. gov. in/ eamcet వెబ్‌సైట్‌ నుంచి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా కౌన్సెలింగ్‌ ప్రారంభించి జూన్‌ 19 నుంచి తరగతులు నిర్వహించాలని భావిస్తున్నామని చెప్పారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 3,924 సీట్లు, 305 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,53,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy