ఏపీ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టింది: మోడీ

22brk-159గత వైభవానికి… చరిత్రకు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసింది ఏపీ సర్కార్. ప్రపంచ చూపు తనవైపు తిరిగేలా రాజధాని నిర్మాణం ప్రారంభించింది. ‘మన రాజధాని మన మనమట్టి’ అంటూ ఏపీ సీఎం ఇచ్చిన పిలుపుకు ప్రధాని కూడా స్పందించారు. నేను సైతం అంటూ శ్రీశ్రీ కవితను ప్రస్తావిస్తూ పార్లమెంట్ నుంచి సేకరించిన మట్టిన చంద్రబాబుకు అందజేశారు ప్రధాని. సభా వేదికపైకి రాగానే ప్రజలకు నమస్కరించారు.. తెలుగులో ప్రజలను పలకరించి ఆకట్టుకున్నారు మోడీ.

దేశానికి అమరావతిలాంటి నగరాలు అవసరం: మోడీ

అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీ ఓ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందన్నారు ప్రధాని మోడీ. విజయదశమి సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం స్థాయి రాజధాని నిర్మాణం కోసం  చంద్రబాబు తపిస్తున్నారంటూ అభినందించారు. దేశంలో అమరావతిలాంటి నగరాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని.

ఇద్దరు సీఎంలు కలవడం శుభపరిణామం: వెంకయ్య

విభజన తర్వాత అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయన్నారు కేంద్రమంత్రి వెంకయ్య. ఈ వేదికపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కలవడం శుభపరిణామమని చెప్పారు. రెండు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. ఏపీ, తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు వెంకయ్య.

ఆంధ్రులకు రెండు పండుగలు: చంద్రబాబు

దేశానికి ఒక పండుగ అయితే ఆంధ్రులకు రెండు పండుగలు వచ్చాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.13వేల గ్రామాల నుంచి కులమతాలకు అతీతంగా మననీరు మనమట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జపాన్, సింగపూర్ ప్రభుత్వాల సహకారం మరువలేనిదన్నారు బాబు. 2050 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి కేంద్రంగా మారుస్తామన్నారు ఏపీ సీఎం

అమరావతి శంకుస్థాపనలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు సీఎం కేసీఆర్. సభా వేదికపై కేసీఆర్ కు ప్రజల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. నవ్యాంద్ర ప్రజల కలల రాజధానికి పూర్తిగా సహకరిస్తామన్నారు సీఎం. ఏపీ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి నాడు ప్రారంభమైన అమరావతి ప్రపంచంలోనే అద్భుత నిర్మాణం కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ లు గా వచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్, జపాన్ మంత్రి యెకుషో అమరావతి త్వరలోనే అద్భుత నగరంగా రెడీ అవుతుందన్నారు.  ఏపీ సర్కార్ కు పూర్తి సహకారం అందిస్తామన్నారు.  భారత్, జపాన్, సింగపూర్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాక్షించారు విదేశీ మంత్రులు. అమరావతి శంకుస్థాపనలో ప్రధాని ఎలాంటి వరాలు కురిపిస్తారో అని ఎదురు చూసిన ఆంధ్రులకు నిరాశే ఎదురైంది. కేంద్రం తరపున ప్రత్యేకంగా ఎలాంటి సహాయాన్ని అనౌన్స్ చేయలేదు ప్రధాని.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy