ఏపీ పంట పండింది

AP_summit_finalఏపీ పంట పండింది. భారీగా ప్రారంభమైన భాగస్వామ్య సదస్సులో…  తొలిరోజే 32 సంస్థలతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ మరో 49 సంస్థలతో అగ్రిమెంట్లు ఓకే చేసుకోనుంది. దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పాయి అటు కేంద్రం.. ఇటు ఏపీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రాజధాని విశాఖపట్నంలో జరుగుతున్న పార్ట్ నర్ షిప్ సమ్మిట్ ను ఘనంగా ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. తొలిరోజే లక్షా 97వేల కోట్ల రూపాయల విలువైన 32 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలన్నీ ఆచరణలోకి వస్తే… ఆంధ్రప్రదేశ్ లో 94వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. తొలి రోజు జరిగిన సమావేశంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోపాటు.. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు.. 11వందలమంది ప్రతినిధులు… 41 దేశాలనుంచి వచ్చిన 4వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తాయన్నారు. ఇంధన రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడానికి వీలుగా  .. అమరావతిలో ఇంధన యూనివర్సిటీని ఏర్పాటుచేయబోతున్నామన్నారు. కాలుష్యాన్ని తగ్గించేలా.. బ్యాటరీలతో నడిచే వాహనాలకు ప్రభుత్వం పన్ను రాయితీలు ఇస్తుందని చెప్పారు. అతి తక్కువ పంపిణీ నష్టాలతో విద్యుత్ సరఫరా చేసి.. దేశంలో నెంబర్ వన్ గా ఉన్నామని.. మరింత నాణ్యతతో కరెంట్ పంపిణీ చేస్తామని అన్నారు. ఇండియాకు సోలార్ పవర్ సెంటర్ గా ఏపీని మార్చుతామని చెప్పారు బాబు.

ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. తొలి ఏడాదిలోనే 11శాతం వృద్ధి సాధించిందనీ.. రాజధాని నిర్మాణంతో… రాబోయే రోజుల్లో దేశాభివృద్ధికే ఏపీ కీలకం కాబోతోందని జైట్లీ చెప్పారు.

రియలన్స్, జీఎంఆర్, అపోలో లాంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థల అధినేతలు పార్ట్ నర్ షిప్ సదస్సులో పాల్గొన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా ఏపీ సర్కారు తీసుకున్న చర్యలు బాగున్నాయన్నారు దిగ్గజ పారిశ్రామికవేత్తలు. భాగస్వామ్య సదస్సు ఇవాళ, రేపు కంటిన్యూ కాబోతోంది. ఇవాళ రెండోరోజు…. ఐటీ రంగంలో మరో 49 అగ్రిమెంట్లపై సంతకాలు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy