ఏపీ పర్యావరణ అధికారి ఇంట్లో.. ACB దాడులు

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమచారంతో  .. విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో పర్యావరణ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఇ.సత్యనారాయణ ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు ACB అధికారులు. బుధవారం (జూలై-18) ఉదయం 6.15 గంటల నుంచి ఏడు చోట్ల తనిఖీలు జరుపుతున్నారు. అనిశా సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అనిశా డైరెక్టర్‌ జనరల్ ఆదేశాల మేరకు విజయవాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, హైదరాబాద్‌ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 56 ఏళ్ల సత్యనారాయణ పర్యావరణ ఇంజనీరుగా ఆదాయానికి మించిన ఆస్తులు కూటగట్టారనే ఫిర్యాదులు రావడంతో.. ఈ సోదాలు చేపట్టారు. విజయవాడలోని మారుతీ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ కాలనీలోని సత్యనారాయణ నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ ఇంటితో సహా విజయవాడలోని కార్యాలయం, అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో మొత్తం ఏడుచోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy