ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పై వేటు

IYR krishna raoఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటు పడింది. ఆయన్ను తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో కృష్ణారావు చేసిన పోస్టులపై అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పదవిలో ఉండి వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెట్టటంపై ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ కృష్ణారావును ఎలాంటి వివరణ అడగకుండానే ఆయన్ని పదవి నుంచి తొలగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐవైఆర్ స్థానంలో వేమూరి ఆనంద సూర్యను చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ తీరును రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిని వివరణ అడిగి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఎలా తొలగిస్తారని బ్రాహ్మణ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy