ఏపీ భవన్ వాటాలు ఎప్పుడో?

Contoversies-On-AP-Bhavan-రాష్ట్ర విభజన జరిగి ఏడాదైనా పంపకాలు మాత్రం కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో సెక్రటేరియట్ లోని ఎనిమిది బ్లాకుల్లో నాలుగు తెలంగాణకు.. నాలుగు ఏపీకి ఇచ్చారు. ఉద్యోగుల పంపకం పూర్తి కాకున్నా..పని కానిచ్చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో మాత్రం పంపకాలు ముందుకు సాగటంలేదు. కమలనాథన్ కమిటీ గడువు అక్టోబర్ 15 వరకు పొడిగించటంతో.. ఉద్యోగుల విభజన ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించటంలేదు. ఏపీ భవన్ 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం పటౌడీ హౌస్ లోని ఏడెకరాల ప్లేస్ ఖాళీగా ఉంది. నిర్మాణం జరిగిన ఒకే బిల్డింగ్ లో రెండు రాష్ట్రాలు పనిచేస్తున్నాయి. ఉద్యోగుల విభజనే సమస్యలకు కారణమైంది. తాత్కాలికంగా ఉద్యోగుల విభజన జరిగినా.. తెలంగాణ వాళ్లను ఆంధ్రాకు.. ఆంధ్రా వాళ్లను తెలంగాణకు కేటాయించటం విమర్శలకు తావిస్తోంది. ఏపీ భవన్ లో మొత్తం 100 మంది ఉద్యోగులుంటే.. అందులో ఏడెనిమిది మంది మాత్రమే తెలంగాణ వాళ్లున్నారు. వాళ్లను కూడా ఆంధ్రాకు కేటాయించారు. ఆంధ్రా ఉద్యోగులు తాము ఏపీలోనే పనిచేస్తామని చెప్పినా పట్టించుకోకుండా తెలంగాణకు తాత్కాలికంగా కేటాయించారు. దీంతో ఆంధ్రా గవర్నమెంట్ పనులు చకచకా జరుగుతుంటే.. తెలంగాణ పనులు మూలన పడుతున్నాయి.

ఉద్యోగుల కేటాయింపు గందరగోళంగా మారటంతో.. సంవత్సర కాలంగా తెలంగాణ భవన్ లో పనులు ఎక్కడికక్కడే పడిఉన్నాయి. 30 మంది ఉద్యోగులను తెలంగాణకు కేటాయించినా.. వారిలో చాలామంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ స్ ఉన్నారు. కనీసం కాంట్రాక్ట్,  ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకంపై కూడా ప్రభుత్వ అనుమతి రాలేదు. ఇక తెలంగాణ భవన్ లోని సమాచార శాఖ.. టూరిజం వంటి చాలా డిపార్ట్ మెంట్లలో ఒక్కరు కూడా సిబ్బంది లేని పరిస్థితి ఉంది. పరిస్థితి ఎంత ఘోరమంటే.. ఎవరైనా మంత్రి ఢిల్లీకి వస్తే కనీసం లెటర్ టైప్ చేయించుకోలేని పరిస్థితి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. HRD మినిస్ట్రీకి లేఖ ఇద్దామనుకున్నా.. దాన్ని కంపోజ్ చేసేవాళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన బిల్డింగ్ లు పంచుకోమని కేంద్రం చెప్పినా.. మొత్తం ఆస్తి నిజాంకు చెందింది కావటంతో.. విభజనకు తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోవటంలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకుంటే కానీ సమస్యకు పరిష్కారం దొరికేలా లేదు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy