ఏపీ హక్కులపై ప్రశ్నించే దిక్కేలేదు : జగన్

jaganఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లానన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన జగన్..  సోమవారం సాయంత్రం పార్టీ ఎంపీలతో కలసి రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ తో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇటీవల కేంద్రం స్పష్టం చేయడంతో జగన్ రాష్ట్ర విషయాలను రాష్ట్రపతికి వివరించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ‘ఏపీకి రావాల్సిన హక్కులపై ప్రశ్నించే దిక్కు లేకుండా పోయింది. విభజన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ కు కేటాయిస్తున్న ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు.పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలుపుకోకపోతే ఎక్కడికి వెళ్ళాలి..ఎవరి దృష్టికి తీసుకువెళ్ళాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వ్యవస్థ పై సామాన్యులకు నమ్మకం పోతుంది. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు. వెంకయ్య నాయుడు విషయంలో… బీజేపీ విషయంలో చంద్రబాబు ద్వంద వైఖరి అవలంభిస్తున్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వము అని కేంద్రం చెప్పిన గట్టిగ అడగలేని పరిస్థితిలో బాబు ఉన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు ఆయనకు లేదు’ అని జగన్ డిమాండ్ చేశారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుకు మద్దతు ఇస్తున్న జాతీయ పార్టీల నేతలను కలవనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy