ఏప్రిల్ 2న ఐఐటీ-జేఈఈ మెయిన్ ఎగ్జామ్

IIT examదేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీలు, ఐఐఎం, కేంద్రీయ విద్యాలయాలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఐఐటీ-జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం తెలంగాణ నుంచి దాదాపు లక్ష మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 80 వేల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అడ్మిట్ కార్డులను జేఈఈ మెయిన్ 2017 అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 8, 9న పెన్నూ పేపర్ లేకుండా ఆన్‌లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని ఐఐటీ మద్రాసు అధికారులు తమ అధికారిక వెబ్‌సైట్లో పేర్కొన్నారు. జేఈఈ మెయిన్ రాత పరీక్షలకు తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మూడు కేంద్రా లు, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నాలుగు కేంద్రాలలో పరీక్షలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy