ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ రాత పరీక్ష

jeeజేఈఈ 2017 మెయిన్ రాత పరీక్ష ఏప్రిల్‌ 2న నిర్వహించనున్నారు. నిర్ణీత సమయానికి ఒక నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు అనుమతించబోమని CBSE ప్రకటించింది. ఇంజనీరింగ్‌ విభాగం బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆఫ్‌లైన్ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్న 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు. ఉదయం 9.25 గంటల వరకే విద్యార్థి పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలి. చివరి అవకాశంగా 9.30 గంటలలోగా కేంద్రంలో ఉండాలి. ఆ తర్వాత నిమిషం ఆలస్యం అయినా అనుమతించేదిలేదని CBSE స్పష్టం చేసింది. బీఆర్క్‌, బి ప్లానింగ్‌ కోర్సులకు ఏప్రిల్‌ 2న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన పరీక్ష ద్వారా ట్రిపుల్‌ ఐటీ, ఎన్ఐటీ, కేంద్ర ప్రభుత్వం ఫండింగ్‌ చేస్తున్న సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మెయిన్ ర్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలు నిర్వహించుకోవచ్చు. తెలంగాణ నుంచి జేఈఈ మెయిన్ కు 69వేలమంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆనలైన్ పరీక్ష ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల్లో విద్యార్థులకు కేటాయించిన తేదీ…సమయం ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy