ఏప్రిల్ 30 నాటికి 9 నియోజకవర్గాలకు నల్లా నీళ్లు

Top waterమూడేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తాం. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వకపోతే  ఓట్లు అడగమని స్పష్టం  చేశారు సీఎం కేసీఆర్. ఇచ్చిన హమీని నిలబెట్టుకునేందుకు  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మిషన్ భగీరథను అనుకున్న టైమ్ లో పూర్తి  చేసేందుకు భగీరథ  ప్రయత్నమే చేస్తోంది  రాష్ట్ర ప్రభుత్వం. టార్గెట్ మూడేళ్లు.. సమయం దగ్గర పడుతోంది. లక్షకు పైగా కిలోమీటర్ల పైపు లైన్లు వేయాలి. ప్రతి ఇంటికి నల్లాతో మంచినీళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మిషన్ భగీరథ కోసం ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని గ్రౌండ్ లోకి దించింది. సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ నుంచి పంచాయితీరాజ్ స్పెషల్ సెక్రటరీ ఎస్పీ సింగ్ తో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టు అధికారులంతా గ్రౌండ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ లో నీళ్ళిచ్చే 9 నియోజకవర్గాల్లో ఎస్పీ సింగ్,  స్మితా సబర్వాల్ పర్యటించి పనులను పర్యవేక్షించారు. పైపు లైన్లు, పంపు హౌజ్ ల నిర్మాణంపై దృష్టిపెట్టారు. పైపు లైన్లు వేసేందుకు అటవీ… రైల్వే,  ట్రాన్స్ కో శాఖల అనుమతులపై అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో  వచ్చే ఏప్రిల్ 30 నాటికి రాష్ట్రంలోని 9 నియోజకవర్గాల్లో ఇంటింటికి నల్లాతో నీరందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. శరవేగంగా పనులు చేస్తున్నారు. ఇప్పటికే 200 కిలోమీటర్ల పైపు లైన్లు వేసినట్లు చెబుతున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, మెదక్ జిల్లాలో సిద్దపేట, గజ్వేల్ ,దుబ్బాక.. వరంగల్ జిల్లాలో జనగాం, పాలకుర్తి, నల్లగొండ జిల్లాలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తిలోని ఓ మండలానికి ఏప్రిల్ 30నాటికి మంచినీళ్లు అందించేందుకు పనులు చేస్తున్నారు. గోదావరి నుంచి హైదరాబాద్ కు తాగునీరందించే రెండు చోట్ల ట్యాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్ దగ్గరలోని ఘన్ పూర్ గుట్ట, మెదక్ జిల్లాలోని కొండపాకలో మరో ట్యాపింగ్ పాయింట్  ఏర్పాటు చేస్తున్నారు. వీటితో 9  నియోజకవర్గాలకు నీళ్లందించనున్నారు. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన పైపు లైన్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. రైటా ఆప్ వే చట్టం ప్రకారం ఎవరి భూమి నుంచైనా వాటర్ గ్రిడ్ పైపు వేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.దీనిలో భాగంగానే CM పామ్ హౌజ్ నుంచి కూడా పైపు లైన్ వేశారు అధికారులు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు  తీవ్ర ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర సర్కార్. అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy