ఏప్రిల్ 30న తెలంగాణలో, మే 7న ఆంధ్రలో ఎన్నికలు

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. లోక్ సభ ఎలక్షన్లతో పాటు మన రాష్ట్ర అసెంబ్లీకి, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుపుతామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ చెప్పారు. మొత్తం 81 కోట్ల 40 లక్షలమంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓట్లేస్తారు. ఈసారి 10 కోట్లమంది కొత్త ఓటర్లు ఓట్లేస్తారు. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మొదటిసారిగా ‘నోటా’ అంటే….ఏ కేండిడేటూ నచ్చలేదనే ఆప్షన్ కూడా ఈ ఎన్నికల్లో ఇస్తారు. ఈవీఎంలతో జరిగే ఈ ఎలక్షన్లలో ‘నోటా’ కోసం ఒక మీట ఉంటుంది. మొత్తం 9 లక్షల 30 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈసారి కొన్నిచోట్ల ఓటు రసీదు కూడా ఇస్తారు.

ఈ ఎన్నికలు 9 విడతల్లో జరుగుతాయి.  ఏప్రిల్ 7, 9, 10, 12, 17, 24,30,  మే 7, 12 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మే 31 నాటికి కొత్త లోక్ సభ కొలువు తీరేలా చూస్తారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఏప్రిల్ 30న, మే 7న జరుగుతాయి. ఓట్ల కౌంటింగ్ మే 16 న జరుగుతుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఎపాయింట్ డే ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయాక జూన్ 2 న ప్రాంతాల ప్రకారం ఆయా ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రాల ఎమ్మెల్యేలుగా ఆటోమేటిక్ గా అయిపోతారు. ఏప్రిల్ 30 న తెలంగాణలోనూ, మే 7న ఆంధ్రలోనూ ఎలక్షన్లు జరుగుతాయి.

తెలంగాణలో………..

  • తెలంగాణలో ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
  •  నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 9
  •  ఏప్రిల్ 10 న నామినేషన్ల పరిశీలన
  • ఏప్రిల్ 12 నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ
  • ఏప్రిల్ 30 న పోలింగ్

సీమాంధ్రలో…………

  • సీమాంధ్రలో ఏప్రిల్ 12 న నోటిఫికేషన్
  • 19 న నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీ
  • 21 న నామినేషన్ల పరిశీలన
  •  ఏప్రిల్ 23 నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ
  •  మే 7న పోలింగ్

రెండు రాష్ట్రాల్లోను మే 16 న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy