ఏమి చేద్దాం…ఏలా చేద్దాం : చిరు ఆధ్వర్యంలో సినీ ఇండస్ట్రీ భేటీ

Chiranjeevi-Press-meetతెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి తొలిసారిగా  కథానాయకులంతా కదిలివచ్చారు. అన్నపూర్ణ 7 ఎకరాల స్టూడియోలో చిరంజీవి ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు, అల్లు అర్జున్ , రాంచరణ్ , నాని, రామ్ , సుమంత్ , వరుణ్ తేజ్ , అల్లు శిరీష్ , నాగార్జున, వెంకటేశ్ , జీవితా రాజశేఖర్ , మంచు లక్ష్మితోపాటు 20 మందికిపైగా హీరోలు హాజరై పరిశ్రమనంతా ఏకతాటిపైకి తెచ్చే అంశంపై చర్చించారు. నిర్మాతలు అల్లు అరవింద్ , బీవీఎన్ ప్రసాద్ , నిర్మాతల మండలి అధ్యక్షుడు కిరణ్ పాల్గొన్న ఈ భేటీలో పరిశ్రమలో ఇటీవల జరిగిన పరిణామాలపై సుమారు గంటపాటు సమావేశమైన హీరోలు… మీడియా పట్ల సంయమనం పాటించాలని భావించినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా చిన్న సినిమాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో స్పష్ణమైన నిర్ణయాలేవి తీసుకోలేదని తెలుస్తోంది. ప్రధానంగా మీడియా వివాదాలపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు సమాచారం. అయితే గత నాలుగు రోజులుగా అన్నపూర్ణ స్టూడియోలో 24 విభాగాల్లోని వారంతా విడతల వారీగా సమావేశపై పరిశ్రమలోని సమస్యలపై సమగ్రంగా ఓ నివేదిక రూపొందిస్తున్నట్లు తెలుస్తొంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy