ఏమి దౌర్భాగ్యం రా ఇది : పాఠ్యాంశంగా పిల్లులను చంపటం ఎలా!

CAT”రెండు చెక్క పెట్టెలు తీసుకోవాలి. ఒక పెట్టె మూత మీద కన్నాలు చేయాలి. రెండోదానికి కన్నాలు లేకుండా చూసుకోవాలి. రెండు పెట్టెల్లోనూ రెండు పిల్లి పిల్లలను పెట్టాలి. మూతలు వేసేయాలి. కొంతసేపటి తర్వాత ఆ మూతలు తీసి చూస్తే, కన్నాలు లేని పెట్టెలో ఉండే పిల్లిపిల్ల చనిపోయి ఉంటుంది” అని ఆ పాఠ్య పుస్తకంలో రాశారు. నాలుగో తరగతి పర్యావరణ శాస్త్రంలో ఇది ఉందని, పిల్లలకు ఇలాంటి పుస్తకాలు చేరడానికి ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు పేరంట్స్. చెప్పటం వేరు.. పాఠం చేప్పే ఉపాధ్యాయులు సైతం ఈ ప్రయోగం చేయమని పిల్లలకు బోధిస్తుండటం ఏంటనేది ఇప్పడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కొందరు ఉపాధ్యాయులు పిల్లల చేతనే పిల్లి పిల్లలను తెప్పించి.. రెండు చెక్క పెట్టెలు వాటిని పెట్టి.. ఈ ప్రయోగం చేసి చూపిస్తున్నారు. ఈ పాఠం ద్వారా పిల్లలు నేర్చుకోవాల్సింది ఒకటైతే.. ఈ ప్రయోగం ఆ చిన్నారుల్లో హింసాత్మక ప్రవృత్తిని ప్రేరేపిస్తుంది అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. పైపెచ్చు పెంపుడు జంతువులుగా ప్రతి ఇంట్లో పిల్లలతో పాటు పెరుగుతున్న పిల్లిపిల్లలపై ప్రయోగం చేయమని చిన్నారుల పాఠ్య పుస్తకాల్లో పేర్కొనడం బాధ్యతారాహిత్యమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉపాధ్యాయులు ఎంత బాధ్యతగా ఉండాలో, ఆ పాఠ్య పుస్తకాలు రాసేవాళ్లు మరింత బాధ్యతగా ఉండాలి. పాఠాలు, వాటిలోని ప్రయోగాలు రాసేటప్పుడు అత్యంత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నాలుగో తరగతి గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్ మెంటల్ స్టడీస్ అనే పుస్తకం ఈ సబ్జెక్ట్ ఉండటం ఓ విడ్డూరం అయితే.. దీన్ని లైవ్ లో చేసి చూపటం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సైన్స్ పుస్తకం రాసిన వాళ్లెవరో గానీ.. ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. సజీవాలు గాలి పీల్చుకుంటాయని చెప్పడానికి వాళ్లు చేయమన్న ప్రయోగం చూస్తే.. ఒక్కసారిగా ఒళ్లు జలధరిస్తుంది. సజీవాలు బతికుండాలంటే గాలి పీల్చుకోవాలని, గాలి లేకుండా ఏ జీవి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకలేదని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఈ విషయాన్ని నిరూపించడానికి ఇంత హింసాత్మక దోరణిలో చేసి చూపటం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు మానసిక నిపుణులు. ఇవాళ పిల్లులు.. రేపు మనుషులనూ ఇలాగే చేస్తారా అంటూ కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ ఫర్హానా అక్తర్, రేణుదేశాయ్.. ఇతర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరేస్తున్నారు. ఎన్విరాన్ మెంటల్ సబ్జెక్ట్ లో ప్రేమించటం ఉండాలి కానీ.. ఎలా చనిపోతుందో చేసి చూడాలని చెప్పటం ఏంటని నిలదీస్తున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy