ఏర్పాట్లు పూర్తి : కర్ణాటకలో రేపే పోలింగ్

kar
కర్ణాటకలో పోలింగ్ కు అంతా రెడీ అయ్యింది. రేపు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఓటరు కార్డుల ఇష్యూతో రాజరాజేశ్వరినగర్ లో పోలింగ్ వాయిదా వేసింది ఎన్నికల కమిషన్. ఇక.. గెలుపు కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. కానీ భారీ వర్షంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
కర్ణాటకలో పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల కమిషన్. సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం ఆరు గంటలకు మాక్ పోలింగ్.. ఆ తర్వాత 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొదటిసారిగా కర్ణాటకలో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ట్రయల్ మెషిన్లు వాడుతున్నారు. అటు.. భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. 2500 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని నియమించినట్టు చెప్పారు అధికారులు.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీస్థానాలున్నాయి. ఇందులో 222 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరగనుంది. మరో రెండు స్థానాల్లో పోలింగ్ వాయిదా వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, జయనగర్ అభ్యర్థి బీఎన్ విజయకుమార్ గుండెపోటుతో చనిపోవడంతో అక్కడ పోలింగ్ వాయిదా వేశారు. మరోవైపు.. పదివేల ఓటరు గుర్తింపు కార్డులు దొరికిన రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గంలో కూడా పోలింగ్ వాయిదా వేస్తున్నామని.. ఈ నెల 31 పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ట్రంలో 20 శాతం సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కర్ణాటక పోలీసులు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. 82 వేల 157 మంది పోలీసులు, హోంగార్డులు, 5వేలకు పైగా కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో ఉణ్నట్టు చెప్పారు.
గనుల కేసులో మాజీ న్యాయమూర్తి బంధువుకు, బీజేపీ నేత శ్రీరాములు డబ్బులు ఇచ్చినట్టుగా చెబుతున్న వీడియోపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. శ్రీరాములు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికను నిలిపేయాలని కోరారు నేతలు. అటు.. కాంగ్రెస్ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. కేరళ నుంచి కొందరిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక పోలింగ్ కు వర్షం అడ్డంకిగా మారింది. రేపు కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. చాలా వేగంతో గాలులు వచ్చే అవకాశముందని అధికారులు చెప్పారు. రేపు వర్షం పడే అవకాశముందని అధికారులు చెప్పినా.. ఇప్పటికే బెంగళూరు సిటీలో వాన దంచికొడుతోంది. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన కనబడుతోంది.
మరోవైపు.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసింది శివసేన. ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ రిగ్గింగ్ చేసే అవకాశముందని ఆరోపించింది. ఎన్నికల్లో విలువలు ఏస్థాయిలో పడిపోయాయో… పెద్ద సంఖ్యలో బయటపడిన నకిలీ ఓటరు గుర్తింపుకార్డులు చూస్తే అర్థమవుతుందని.. తమ పత్రిక సామ్నాలో ఆర్టికల్ రాసింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy