మేఘాలయా ఊరు, వాల్డ్ లోనే క్లీన్ !

47_bigఅదో కుగ్రామం… కానీ పరిశుభ్రత విషయంలో రాజీ పడదు ఆ గ్రామం. ప్రతి ఇంటికి ఓ టాయిలెట్ నిర్మించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు…. ఏషియాలోనే అతి పరిశుభ్రమైన గ్రామంగా నిలిచింది.

ఆ గ్రామం పేరు మాలినాంగ్, ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. కనీసం ఈ గ్రామానికి సరైన రోడ్ సౌకర్యం కూడా లేదు. అన్ని మామూలు ఇళ్ళే. కానీ ప్రతి ఇంటికి ఓ టాయిలెట్ ఉంది. ఈ టాయిలెట్లను నిర్మల్ భారత్ అభియాన్ స్కీం ద్వారా కట్టుకున్నారు. 503 జనాభాగల ఈ గ్రామంలో 91 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళో చెత్త ఎక్కడపడితే అక్కడ పడెయ్యరు. రోడ్ల మీద వెదురుకర్రలతో తయారుచేసిన బుట్టలు ఉంటాయి… ఎవరైనా కూడా చెత్త అందులోనే వెయ్యాలి. స్కూల్ పిల్లలు కూడా స్కూల్ పరిసరాలను చాలా క్లీన్ గా ఉంచుతారు. ఇలా క్లీన్ విషయంలో ఈ గ్రామ ప్రజలు ఎప్పుడు రాజీ పడలేదు. వాళ్ళ పరిశుభ్రతను గుర్తించిన ఇండియా డిస్కవరీ మాగజైన్, 2003లో ‘ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్’గా ప్రకటించింది. దీంతో, ప్రపంచ పర్యావరణవేత్తలు, టూరిస్టులు మాలినాంగ్ బాట పట్టారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy