ఏ కాలంలో ఉన్నాం : నేలపై ఉమ్మును.. నోటితో నాకించారు

bihar-arachakamబీహార్ లోని నలందలో అమానుషం జరిగింది. అడగకుండా ఇంట్లోకి వచ్చాడని… ఒక పెద్దాయనపై సర్పంచ్ మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. అతనితోనే నేలపై ఉమ్మించి… మళ్లీ ఆ ఉమ్మిని నాకించాడు. అత్యంత హేయమైన ఈ సంఘటన సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందలోని అజైపూర్ గ్రామంలో జరిగింది. ఉమ్మిని నాకించడమే కాకుండా ఇంట్లోని ఆడవాళ్లతో చెప్పులతో కొట్టించారు. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. దీనిని ఖండించిన బీహార్ మంత్రి నందకిషోర్ యాదవ్… దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అధికారులు… ఘటనపై దర్యాప్తు కూడా మొదలుపెట్టారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy