ఏ నిమిషానికి ఏమి జరుగునో.. : మాజీ యాంకర్ మృతి

unexpected-deathనిత్యం రద్దీ ఏరియా.. జనం బాగా తిరుగుతుంటారు.. ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది.. పెద్ద పెద్ద వాళ్లు సైతం ఆ రోడ్డులో తిరిగేవాళ్లే. అలాంటి రోడ్డులో ఓ చెట్టు కూలింది. చెట్టు పడిపోవటం కామన్ అయినా.. ఆమె బ్యాడ్ లక్ ఎంతగా ఉంది అంటే.. సరిగ్గా నెత్తినే చెట్టు పడిపోయింది. స్పాట్ లోనే చనిపోయింది. ఈ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వీడియో చూస్తే షాకింగ్ గానూ ఉంటుంది.
వివరాల్లోకి వెళితే.. ముంబై మహానగరం. చెంబూర్ ప్రాంతం. ఉదయం ఏడు గంటలకు కంచన్ నాథ్ అనే 58 ఏళ్ల మహిళ రోడ్డుపై మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చింది. అప్పటికే వర్షపు జల్లులు పడుతున్నాయి. రోజూ వెళ్లే రోడ్డే.. చిరు జల్లులే కదా వాకింగ్ ప్రారంభించింది. చంద్రడే సొసైటీ ఏరియాకు వచ్చిన సమయంలో.. సరిగ్గా ఆమె ఉన్న ప్రదేశంలోనే రోడ్డు పక్కన ఉన్న పెద్ద కొబ్బరిచెట్టు పడింది. అది కూడా ఆమె నెత్తిమీదనే పడింది. స్పాట్ లోనే కుప్పకూలిపోయింది.
చుట్టుపక్కలవారు వెంటనే ఆమెను బయటకు లాగారు. అప్పటికే స్పృహ లేకుండా పడి ఉంది. సమీపంలోని శుష్రత్ ఆస్పత్రికి తరలించారు. icuలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
కంచన్ నాథ్.. గతంలో దూరదర్శన ఛానల్ లో యాంకర్ గా పని చేసింది. చాలా ప్రొగ్రామ్స్ కూడా చేసింది. ఎంతో మందికి సుపరిచితురాలు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. ఈ ఘటనపై ఆమె భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తీరును తప్పుబట్టారు. ప్రమాదంలో ఉన్న చెట్లను తొలగించటంలో విఫలం అయ్యారని… రోడ్డుపైకి వచ్చిన జనానికి రక్షణ ఇవ్వటంలో BMC ఫెయిల్ అయ్యిందని ఆరోపణలు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy