ఏ పార్టీతోనూ కలిసి వెళ్లం : కేసీఆర్

kcr-1తెలంగాణ చిన్న రాష్ట్రం కాదన్నారు సీఎం కేసీఆర్. జాతీయ ఛానల్ సదస్సులో మాట్లాడారు.   కొత్త రాష్ట్రమైనా అభివృద్ధిలో దేశంలోనే మొదటిగా ఉందన్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ గుజరాత్ ను దాటిపోయిందన్నారు. భౌగోళికంగా బీహార్, బెంగాల్ కంటే తెలంగాణ పెద్దదన్నారు. వ్యవసాయ రంగంలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలవబోతున్నదన్నారు. అన్ని రాష్ట్రాల కంటే 16 రంగాల్లో తెలంగాణ ముందుందన్నారు. నీటి పారుదల రంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తున్నదని చెప్పారు. ప్రాజెక్టులు అన్నీ పూర్తి అయితే కోటి ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు సీఎం.

కేసీఆర్ తర్వాత ఎందరో సీఎంలు వస్తారు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తెలంగాణకు పోలికే లేదన్నారు సీఎం కేసీఆర్. ఆ రాష్ట్రం కంటే ఎంతో ముందుందన్నారు. త్వరలోనే ధనిక రాష్ట్రాలలో ఒకటిగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రగతి భవన్ అధికారిక నివాసమని చెప్పారు. అందులో కేసీఆర్ ఒక్కరే ఉండరని.. నా తర్వాత ఎందరో సీఎంలు వస్తారన్నారు.

రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన…

ఎన్నికల్లో ఏ పార్టీతోనూ కలిసి వెళ్లాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాము స్వతంత్రంగానే ఉంటామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఉండాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అందరికీ రిజర్వేషన్లు అందించాలన్నారు. పక్క రాష్ట్రాలు కూడా రిజర్వేషన్ల శాతం పెంచినప్పుడు తామెందుకు పెంచకూడదన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చను లేవనెత్తుతామన్నారు.

ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదు..

దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ విండో సిస్టంను ప్రవేశ పెట్టామన్నారు. దీంతో కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని పర్మిషన్లు కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ అన్నారు. దీనికి ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రమే తన కుటుంబమని..దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని అన్నారు. వారసత్వంపై మాట్లాడుతూ కేసీఆర్ వారసులు జైలుకు వెళ్లారన్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తన పిల్లలు ఎన్నికలలో గెలిచారని చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy