ఏ పార్టీవి ఇవి : కర్ణాటకలో 10 వేల నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం

voterకర్ణాటకలో నకిలీ ఓటరు ఐడెంటిటీ కార్డులు హాట్ టాపిక్ అయ్యాయి. బెంగళూరు జాలహల్లి ఏరియాలోని ఓ అపార్ట్ మెంట్ లో 9 వేల 746 ఓటరు గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు గుర్తించారు. వీటితో పాటు.. ల్యాప్ టాప్ లు, ప్రింటర్లు సీజ్ చేశారు. జాలహల్లి ప్రాంతం రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఓటరు గుర్తింపు కార్డుల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఓటరు కార్డులు బీజేపీ కుట్రేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

10వేల నకిలీ ఓటరు కార్డులు బయటపడటంతో కర్నాటకలో కలకలం. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న సమయంలో వేల సంఖ్యలో నకిలీ ఓటరు కార్డులు బయటపడటంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. బూత్ కమిటీలను అప్రమత్తం చేశారు. నకిలీ ఓటరు కార్డులపై నిఘా పెట్టాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఆయా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, బూత్ కమిటీలకు సమాచారం ఇచ్చారు. 10వేల నకిలీ కార్డులు బయటపడటంపై విచారణకు ఆదేశించారు కర్ణాటక ఎన్నికల అధికారులు. కార్డుల్లో ఉన్నవారంతా నిజంగానే ఓటర్లా..? కాదా..? అనే దానిపై విచారణ చేయాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే విచారణ కూడా మొదలు అయ్యిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy