ఏ మంత్రం వేసావే.. ఫస్ట్ లుక్

vijay‘అర్జున్‌రెడ్డి’ తో విజయ్‌ దేవరకొండ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఆ సినిమా ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరో ప్రేమకథతో రెడీ అవుతున్నాడు విజయ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏ మంత్రం వేసావె’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది . శ్రీధర్‌ మర్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. గోలిసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోపక్క విజయ్‌ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మాణంలో వస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నారు. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా వస్తున్న ‘మహానటి’ చిత్రంలోనూ ఆయన కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy