ఏ రోజుకు ఆ రోజే : పెట్రోల్, డీజిల్ రేట్లు మార్పు

petrol-dieselపెట్రోట్, డీజిల్ ధరల నిర్ణయంలో ఇండియన్ ఆయిల్ కంపెనీలు కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తున్నాయి. దేశంలో 90శాతం ఆయిల్ మార్కెట్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ప్రతి 15 రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలే ఆయిల్ ధరలు నిర్ణయించేవి. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలకాలని ఏ రోజుకు ఆరోజు.. ఆయా ఆయిల్ కంపెనీలే అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్ అనుసరించి పెట్రోల్, డీజిల్ ధరలను ఆరోజు అర్ధరాత్రి ధరలు నిర్ణయించుకునే విధంగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) నిర్ణయించింది.

పెట్రోల్, డీజిల్ ధరలను పైసలతో సహా ప్రతిరోజూ అర్ధరాత్రి ధరలపై నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకోసం IOC ఎగ్జిక్యూటివ్ అధికారులతో పాటు అనుబంధ కంపెనీలు అయిన భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ అధికారులు, ప్రైవేట్ కంపెనీ అధికారులు కూడా పెట్రోల్, డీజిల్  ధరల నిర్ణయంలో పాలుపంచుకుంటారని తెలుస్తోంది.

అంతర్జాతీయ ధరలలో మార్పులను అనుసరించి ప్రతిరోజు ధరలను ఆయా కంపెనీలే పైసలతో నిర్ణయించనున్నారు. ఈ పద్దతికి డైనమిక్ ఫ్యుయల్ ప్రైసింగ్ గా పేరు పెట్టారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు రిలయన్స్, ఎసార్ ఆయిల్ కంపెనీలు ఇకపై లబ్ది పొందనున్నాయి.

One Response to ఏ రోజుకు ఆ రోజే : పెట్రోల్, డీజిల్ రేట్లు మార్పు

  1. Mallikarjun says:

    This weill lead to more opportunities for more corruption……

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy