ఐఎస్ఐఎస్ హెచ్చరికలకు భయపడను: ఒవైసీ

ASADమజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ఐఎస్ఐఎస్ నుంచి వార్నింగ్స్ వచ్చాయి. ISIS గురించి తెలియకపోతే నోరు మూసుకోవాలని ట్విట్టర్  బెదిరింపులొచ్చాయి. త్వరలోనే భారత్ లో కూడా అటాక్స్ చేస్తామని హెచ్చరించిందా సంస్థ. ఐసిస్ బెదిరింపు ట్వీట్స్ కు స్పందించిన అసద్.. ఏదోరోజు అందరూ పోవాల్సిందేనని.. ఆ సంస్థకు తాను భయపడనని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఐసిస్-ఇస్లాం విధానాలు వేర్వేరని.. దానికి ముస్లిం యువత అట్రాక్ట్ కావొద్దని సూచించారు. గతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను రేపిస్టులు, హంతకులుగా అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. యువకులను కూడా ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని.. బహిరంగ సభల్లోనూ అసద్ అనౌన్స్ చేశారు. దీంతో ఐఎస్ఐఎస్ ఆయన్ని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఐసిస్ దాడులతో లక్షన్నర మంది ముస్లింలు చనిపోయారన్న అసద్… అమెరికా సామ్రాజ్యవాద విధానాల వల్లే అది పుట్టిందని ఆరోపించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy