ఐఐటీల్లో సీట్లు పెంపు: అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు

IIT-WOMENఅమ్మాయిలకు బంపర్ ఆఫర్ ఇచ్చాయి ఐఐటీలు. ఇకపై ఐఐటీల్లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు ఉండనున్నారు. అమ్మాయిలు, అబ్బాయిల సంఖ్యను సమం చేయడమే లక్ష్యంగా జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జాబ్‌) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఐఐటీల్లో అమ్మాయిలకు అదనంగా సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. మొదటి దశగా వచ్చే ఏడాది 14 శాతం సీట్లను అదనంగా అమ్మాయిలకు కేటాయించనున్నారు. దాదాపు 1500 సీట్లు వీరికి అదనంగా దక్కనున్నాయి. 2020 నాటికి 20 శాతానికిపైగా సీట్లు పెంచాలని జాబ్‌ నిర్ణయించింది. అంటే 2020 నాటికి దాదాపుగా 2300 వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ‘జాబ్‌’ తీసుకున్న నిర్ణయంతో ఏటా అమ్మాయిలకు వందల సంఖ్యలో సీట్లు అందుబాటులోకి వస్తాయి.

అమ్మాయిలకు సీట్లు పెరుగుతున్నందున తమ సీట్లకు కోత పెడతారని అబ్బాయిలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సూపర్‌ న్యూమరీ విధానంలో అమ్మాయిలకు సీట్లు పెంచనున్న నేపథ్యంలో అబ్బాయిలకు ఎలాంటి ఇబ్బందీ లేదని జాబ్‌ ప్రకటించింది. గతంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినప్పటికీ టాప్‌ ర్యాంకు లేకపోవడంతో అమ్మాయిలకు సీట్లు దక్కేవి కావు. తాజాగా జాబ్‌ తీసుకున్న నిర్ణయంతో టాప్‌ ర్యాంకులో లేకపోయినప్పటికీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హత సాధించిన వారిలో కొద్దిమంది అమ్మాయిలకు సీట్లు దక్కనున్నాయి. ఇక జాబ్‌ మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. ఐఐటీ చదువులకు అమ్మాయిల్ని దూరంగా ఉంచడం, కోచింగ్‌కు అమ్మాయిలను పంపించకపోవడంతో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విధానాన్ని మార్చేందుకు చర్యలు తీసుకుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy