ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్న సుష్మా

sushma-swarajవచ్చే నెలలో న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్యసమితి 71వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసగించనున్నారు. గత రెండేళ్లుగా ప్రధాని మోడీ ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే ఈ సారి సుష్మాస్వరాజ్ హాజరై సెప్టెంబర్ 26న ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తారు. సెప్టెంబర్‌ 20 నుంచి 26 వరకు ఈ జనరల్‌ డిబేట్‌ కొనసాగనుంది. 2014లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని మోడీ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని ప్రపంచ నేతలను కోరారు. అందుకు సమితి ఆమోదం తెలపడంతో జూన్‌ 21న ఏటా యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy