ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా మలాలా

malalaనోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌లాలాకు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఐక్యరాజ్యసమితి శాంతి దూతగా నియమితులయ్యారు. యునైటెడ్ నేష‌న్స్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్ ఈ అవార్డుకు మ‌లాలాను ఎంపిక చేశారు. వ‌చ్చే వారం US ప్ర‌ధాన కార్యాల‌యంలో పుర‌స్కార కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. బాలిక‌ల విద్య కోసం ఆమె చేస్తున్న పోరాటం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోందన్నారు గుటెర‌స్ . పాకిస్థాన్‌లో బాలిక‌ల విద్య కోసం పోరాటం చేస్తున్న మ‌లాలాపై కొన్నేళ్ల క్రితం తాలిబ‌న్లు దాడి చేశారు. ఆ త‌ర్వాత ఆమె ఓ ఫౌండేష‌న్‌ను స్థాపించింది. రెండేళ్ల క్రితం అత్యంత చిన్న వ‌య‌సులో నోబెల్ గెలిచిన వ్య‌క్తిగా కూడా నిలిచింది. ఇప్పుడు ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌లాలాను శాంతిదూత‌గా నియ‌మించారు. ఐక్యరాజ్యసమితి శాంతి దూత పదవిని మలాలా సోమవారం చేపట్టనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy