ఐటీ ఆన్ హై అల‌ర్ట్: విప్రోను పేల్చేస్తాం

wiproబెంగ‌ళూరులోని విప్రో ప్ర‌ధాన కార్యాలయానికి బెద‌రింపు లేఖ వ‌చ్చింది. రూ.500 కోట్లు  తాము చెప్పిన అడ్ర‌స్‌కు పంపాల‌ని  లేదంటే ఆఫీసును పేల్చేస్తామ‌ని తెలుపుతూ గుర్తు తెలియ‌ని ఆగంత‌కుడు ఆఫీస్‌కు మెయిల్ పంపాడు. ఈ బెదిరింపు లేఖ‌పై స్థానిక సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. సైబ‌ర్ టెర్ర‌ర్ చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ మెయిల్ ఎక్క‌డినుంచి వ‌చ్చిందో గుర్తించే పనిలో ప‌డ్డారు పోలీసులు. ఎవ‌రైన ఆక‌తాయిలు ఈ ప‌ని చేశారా అన్నా కోణంలో కూడా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ఇటీవ‌లే విప్రో త‌న లోగోను కూడా మార్చిన సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy