ఐటీ మినిస్టర్ వార్నింగ్ : జుకర్ బర్గ్.. మా డేటా లీక్ అయితే సహించం

RAVI SHANKARఫేస్‌బుక్‌పై ఆరోపణలు, విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను దొంగలించిన కేంబ్రిడ్జ్ అనలిటికాతో, కాంగ్రెస్‌కు కూడా లింక్‌ లున్నట్టు బీజేపీ ఆరోపిస్తోంది. ఇది ఒకవేళ అవసరమైతే.. దీనిపై తాము కఠిన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమేనన్నారు ఐటీశాఖ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.

అయిదు కోట్ల మంది ఫేస్‌బుక్ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా 2016లో అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో బ్రిటన్ దేశం ఫేస్‌బుక్ ఓనర్ జుకర్‌బర్గ్‌కు సమన్లు జారీ చేసింది. ఇప్పుడు భారత్ కూడా ఫేస్‌బుక్ వివాదంపై తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇండియన్ల డేటా చోరీ అయితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. బీజేపీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. భారత ఐటీ చట్టాలు బలంగా ఉన్నాయని, ఒకవేళ డేటా చోరీ జరిగినట్లు తెలిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని జుకర్‌బర్గ్‌కు వార్నింగ్ ఇచ్చారు మంత్రి రవిశంకర్.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఐటీశాఖ మంత్రి.. ఫేస్‌బుక్ వివాదంపై కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లో కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఎందుకు సంబంధాలు ఉన్నాయా అని అడిగారు. ఓటర్లను ఆకర్షించేందుకు కేంబ్రిడ్జ్ అనలిటికా భారతీయుల డేటాను చోరీ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రి రవిశంకర్ ప్రసాద్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy