ఐడియా మ్యాజిక్ ఆఫర్ : రూ.3,300 క్యాష్ బ్యాక్

ideacellular-600x420కొత్త ప్లాన్లు.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి టెలికాం కంపెనీలు. లేటెస్ట్ గా ఐడియా సెల్యులార్‌ మ్యాజిక్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద రూ. 3 వేల 300 రూపాయల విలువైన క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌, ఆన్‌లైన్‌ ఛానళ్లను వాడుతూ రూ.398, అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

క్యాష్ బ్యాక్ వివరాలు

… రూ.50 విలువైన ఎనిమిది డిస్కౌంట్‌ ఓచర్లు ఇస్తారు.

… ఈ డిస్కౌంట్‌ ఓచర్లను.. కస్టమర్లు రీఛార్జ్‌ చేయించుకునే రూ.300, అంత కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే సమయంలో రిడీమ్‌ చేసుకోవచ్చు. ఏడాదిపాటు వాడుకోవచ్చు.

… వీటితోపాటు రూ.2,700 విలువైన ఐదు షాపింగ్‌ కూపన్లను కూడా లభిస్తాయి.

… మై ఐడియా యాప్‌ లేదా కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్‌ చేయించుకున్న కస్టమర్లకు రూ.200 వరకు వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది.

… రూ.398 ప్లాన్‌ కింద ఐడియా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ (లోకల్‌, STD, నేషనల్‌ రోమింగ్‌ కాల్స్‌), రోజుకు 1GBడేటా, 100 SMSలను 70 రోజులు అందించనుంది.

… ఈ మ్యాజిక్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఐడియా ప్రీపెయిడ్‌ కస్టమర్లకు 2018 ఫిబ్రవరి 10 వరకు అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy