ఐదో అంతస్తు : డ్రగ్స్ సీక్రెట్స్ తెలిసేది ఈ గదిలోనే

sit-roomహైదరాబాద్ లో డ్రగ్స్ ఇష్యూ బయటపడినప్పటి నుంచి.. అబ్కారీ భవన్ ఫోకస్ అయింది. టాలీవుడ్ లింక్ బయటపడడం.. కొందరికి నోటీసులు.. మరికొందరి విచారణతో సిట్ గురించి కూడా పబ్లిసిటీ అయింది. అసలు అబ్కారీ భవన్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఏం జరుగుతోంది..? అక్కడెలాంటి పరిస్థితి ఉందో చూద్దాం..

ఏం జరుగుతోంది.. వాళ్లేం అడిగారు.. వీళ్లేం చెప్పారు.. పది రోజులుగా ఇదే పరిస్థితి. డ్రగ్స్ ఇష్యూ బయటపడడం.. దాని తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లింక్ వెలుగుచూడడం.. కొంత మందికి నోటీసులు.. ఇంకొంత మంది విచారణకు హాజరుకావడం  వరసగా జరిగిపోయింది. రోజుకొకరు గంటల కొద్దీ విచారణ.. వాటికి సమాధానాలు.. అన్నింటికీ కేరాఫ్ అబ్కారీ భవన్ లోని ఫిఫ్త్ ఫ్లోర్. ఐదో అంతస్తులోనే ప్రస్తుతం సిట్ అధికారులు విచారణకు హాజరయ్యే వారిని ప్రశ్నిస్తున్నారు.

నాంపల్లిలో ఉన్న అబ్కారీ భవనంలోకి వచ్చిన వాళ్లు నేరుగా లోపలికి వచ్చి ఐదో అంతస్తుకి పోతున్నారు. వాళ్లతో వచ్చినోళ్లను కిందనే ఆపి.. నోటీసులు అందుకున్న వాళ్లను మాత్రమే ఫిఫ్త్ ఫ్లోర్ కి అనుమతిస్తున్నారు అధికారులు. అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు సంబంధించిన రూమ్ ఉన్నది. అందులోనే రెండు టేబుళ్లు, ఓ మూలకు కంప్యూటర్. నాలుగు కుర్చీలున్నాయి. పార్టీషన్ చేసిన ఆ గదిలోనే ప్రస్తుతం డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. అక్కడే సిట్ అధికారుల విచారణ చేస్తారు. విచారణ మొత్తాన్ని కెమెరాల్లో షూట్ చేస్తున్నారు.

ఐదో అంతస్తులో ఉన్న సిట్ ఆఫీసే… పది రోజుల నుంచి డ్రగ్స్ కేసులో కీలకంగా మారింది. మొదటి రోజు పూరీ జగన్నాథ్, రెండో రోజు సుబ్బరాజు, మూడో రోజు శ్యామ్ కె.నాయుడు, నాలుగో రోజు చిన్నా, ఐదో రోజు నవదీప్, ఆరో రోజు తరుణ్, ఏడో రోజు చార్మీ, ఎనిమిదో రోజు ముమైత్ ఖాన్, తొమ్మిదో రోజు రవితేజ, పదో రోజు రవితేజ డ్రైవర్.. ఇలా ఎంక్వైరీ జరుగుతూనే ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy