ఐదో వన్డే: సౌత్ ఆఫ్రికా టార్గెట్- 275

soపోర్ట్ ఎలిజబెత్ వేదికగా సౌత్ ఆఫ్రికా- భారత్ మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లతో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. 275 పరుగుల టార్గెట్ ను సౌత్ ఆఫ్రికా ముందు ఉంచింది భారత్.మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఓపెనర్లు ఆచితూచి ఆడారు. సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో 115 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 36, శిఖర్ దావన్ 34, శ్రేయాస్ అయ్యర్ 30, భువనేశ్వర్ 19, ధోని 13, కులదీప్ యాదవ్ 2 పరుగులు చేశారు.

సౌతాఫ్రికా బౌలర్లలలో నిగిడి 4 వికెట్లు పడగొట్టగా, రబడా 1 వికెట్ తీశారు.

ఈమ్యాచ్ గెలిస్తే టీమిండియా సిరీస్ సొంతం చేసుకుంటుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy