ఐనవోలు బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

INAVOLUJATARAవరంగల్ జిల్లా ఐనవోలు మల్లిఖార్జున స్వామి  బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. సంక్రాంతి నుంచి దాదాపు 3 నెలలపాటు జరిగే  జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి వరంగల్ జిల్లా ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయం. ఒక చేతిలో ఖడ్గం.. మరో చేతిలో త్రిశూలం.. ఢమరుకం, తలపై కిరీటం, కోర మీసాలు, కళ్లు చెదిరే అభరణాలతో దర్శనమిస్తాడు ఇక్కడి మల్లిఖార్జున స్వామి. కుడివైపున గొల్ల కేతమ్మ, ఎడమ వైపున బలిజె మేడలమ్మలు కొలువై ఉంటారు. ఏటా సంక్రాంతి సమయంలో స్వామి వారి జాతర వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఆలయం ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కాకతీయుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. పూర్తిగా రాతితో మల్లిఖార్జునస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. కాకతీయ రాజు అయ్యన్న దేవుడు నిర్మించటంతో ఈ గ్రామానికి ఐనవోలుగా పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు.జాతర సమయంలో బోనాలు, పట్నంతో స్వామి వారికి మొక్కులు సమర్పించటం ఇక్కడి ప్రత్యేకత. దర్శనానికి ముందే బోనాలు తయారు చేస్తారు భక్తులు. ఆ తరువాత స్వామివారి ముందు పెద్ద పట్నం వేసి ఒగ్గు పూజారులతో మొక్కులు తీర్చుకున్నాక.. స్వామి వారి దర్శనం చేసుకోవడం అనవాయితీగా వస్తోంది. శైవ క్షేత్రాల్లో అరుదుగా కనిపించే శ్వేత లింగం ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయం ప్రత్యేకత. ఆలయంలో నిత్యం రుద్రాభిషేకాలు, శాస్త్ర పరంగా అర్చనలు చేస్తామని ఒగ్గు పూజారులు చెబుతున్నారు. భక్తులకు శుభం కలగాలని తాము పెద్దపట్నం వేసి స్వామి వారికి సమర్పిస్తామంటున్నారు.  కాకతీయుల కాలం నుంచి ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు దేవాలయం నిర్వహణ చూసేవారు. కానీ 1969 తర్వాత దేవాదాయశాఖ ఆధీనంలోకి వెళ్లింది. మార్నేని వంశస్తులే ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంక్రాతి రోజున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా పార్కింగ్, టాయిలెట్స్ విషయంలో కలిగే అసౌకర్యాలను ఈసారైనా పూర్తిగా కల్పించాలంటున్నారు భక్తులు.  సంక్రాంతి రోజున ప్రారంభమైన జాతర….ఉగాది వరకు జరుగుతుంది. దాదాపు 3 నెలల పాటు జరిగే జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy