ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా “వివో”

vivo-logoఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ ల తయారీ కంపెనీ ‘వివో’ ముందుకొచ్చింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా పెప్సీ 2013లో అగ్రిమెంట్ చేసుకుంది. రూ. 396 కోట్ల భారీ మొత్తానికి కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 5 సంవత్సరాలు టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించాల్సి ఉంది.  అయితే  ఐపీఎల్ లో  స్పాట్ ఫిక్సింగ్ బయటపడటంతో పెప్సీ ఈ అగ్రిమెంట్  నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. పెప్సీ కన్నా ముందుగా ఐపీఎల్ కు డీఎల్ఎఫ్ టైటిల్ స్పాన్సర్ గా ఉంది. 200 కోట్లకు కుదిరిన డీఎల్ఎఫ్ ఒప్పందం 2008 నుంచి 2012 వరకు కొనసాగింది.

ఈ విషయంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. పెప్పీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడం చాలా చిన్న విషయం అన్నారు. ఈ ఇన్సిడెంట్ ఐపీఎల్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదన్నారు.  పెప్సీతో తమ అనుబంధం చక్కగా కొనసాగిందని… సామరస్య పూర్వకమైన చర్చలతో ఈ వ్యవహారం ముగుస్తుందని ప్రకటించారు. రెండు సంవత్సరాలకు టైటిల్ స్పాన్సర్ గా ఇప్పటికే చైనా కంపెనీ “వివో”తో ఐపీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. పెప్సీ ఒప్పందానికి వర్తించిన నియమనిబంధనలే ఈ డీల్ కు కూడా వర్తిస్తాయని ప్రకటించింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy