ఐపీఎల్ లో అమెరికన్ ప్లేయర్!

377740ఐపీఎల్ లో అమెరికన్ ప్లేయర్… అదేంటి అమెరికా క్రికెట్ ఆడే దేశం కాదు కదా? అని డౌట్ పడుతున్నారా ! అవును…వచ్చే ఐపీఎల్ లో అమెరికాకు చెందిన బాస్కెట్ బాల్ ప్లేయర్ ఆడే ఛాన్స్ ఉంది. ఆ ప్లేయర్ ను సెలెక్ట్ చేయడానికి ‘మిలియన్ డాలర్ బ్యాట్’ పేరిట ఓ రియాల్టీ షో రూపొందనుంది. అమెరికా బేస్‌బాల్ టీంలోని  బ్యాటర్స్ ఇందులో పాల్గొనేందుకు అర్హులు. స్పోర్ట్స్ ఏజెంట్ జేబీ బెర్న్‌స్టీన్, యాష్ వాసుదేవన్ ఈ షోను రూపొందించారు. ఈ షోలో గెలిచిన ప్లేయర్ ను ఐపీఎల్ లో ఆడిస్తారు. ఈ విషయంపై బీసీసీఐ నుండి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. అయితే ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ దీనికి మద్దతిచ్చారు. ‘క్రికెట్‌ను డెవలప్ చేసే ఏ చర్యకైనా మేం అనుకూలంగానే ఉంటాం’ అని చెప్పారు. బెర్న్‌స్టీన్‌ గతంలో ‘మిలియన్ డాలర్ ఆర్మ్’ అనే షో నిర్వహించాడు. అమెరికన్ ప్రొఫెషనల్ బేస్‌బాల్ లీగ్‌లో ఇండియా ప్లేయర్ ను ఆడించడం ఈ షో ముఖ్య ఉద్దేశం. ఇందులో రింకూ సింగ్ విజేతగా నిలిచి పిచర్ (బంతి విసిరేవాడు)గా మారాడు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy