ఐపీఎల్ – 10: ఢిల్లీ టార్గెట్ 196

delhiఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది.  అరోన్ ఫించ్ (69) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ గుజరాత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. తొలి మూడు వికెట్లు త్వరగా కోల్పోయినా.. అరోన్ ఫించ్ బౌండరీల మోత మోగించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 69 పరుగుల దగ్గర షమీ బౌలింగ్ లో ఔట్ అయ్యడు. ఫించ్ దూకుడుతో గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో మహ్మద్ షమీ, కమిన్స్, అమిత్ మిశ్రా, బ్రాత్ వైట్ తలో వికెట్ తీశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy