కింగెవరో, ఖంగుతినేదెవరో..!

Ipl7-finalఐపీఎల్ 7 లో నేడు ఆఖరి పోరాటం జరిగుతుంది. 47 రోజులుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ 7 సీజన్ లో.. ఇవాళ ఫైన్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ ట్రోఫీకోసం పంజాబ్, కోల్ కతా టీమ్ లు తలపడుతున్నాయి. అయితే 2012 టైటిల్ నెగ్గిన కోల్ కతా రెండో కప్ ను అందుకోవాలని చూస్తోంది. తొలిసారిగా ఫైనల్ కు చేరిన పంజాబ్.. టైటిల్ గెలవాలన్న కసితో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా సాగుతుందనటంలో సందేహం లేదు.

ఈ సీజన్ లో కోల్ కతా ప్రస్థానం ఆసక్తికరంగా మొదలైంది. దుబాయిలో జరిగిన 5 మ్యాచుల్లో కేవలం రెండే గెలిచి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. ఇక ఇండియాలో జరిగిన రెండు మ్యాచుల్లో కూడా ఓటమి చవిచూసింది. దీంతో కోల్ కతాను మొదట అందరూ లైట్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ప్లే ఆఫ్ చేరే వరకు కోల్ కతా అప్రతిహాసంగా ముందుకు సాగింది. సీజన్ లో ఎదురులేని జట్టుగా భావించిన పంజాబ్ ను సైతం క్వాలిఫైయర్-1 మ్యాచ్ లో ఓడించి అందరినీ షాక్ కు గురిచేసింది. అదే ఉత్సాహంతో ఫైనల్లో పంజాబ్ ను ఇంటికి పంపాలని చూస్తోంది.

ఇక పంజాబ్ గురించి చెప్పక్కర్లేదు. సీజన్ లో అత్యధిక విజయాలు సాధించి టైటిల్ ఫేవరేట్ గా నిలిచిన పంజాబ్.. ప్లేఆఫ్ లో చోటు సంపాదించుకున్న తొలి టీమ్ కావడం విషేషం. క్వాలిఫైయర్-1 లో కోల్ కతా చేతిలో ఓడినా.. క్వాలిఫైయర్-2 లో చెన్నైని ఓడించి సత్తా ఏంటో చాటుకుంది. తిరుగులేని చెన్నైని ఓడించి కోల్ కతాకు సవాల్ విసిరింది. ఫైనల్ లో గెలిచి తొలి టైటిల్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.

ఎవరి బలమెంత :

కోల్ కతా నైట్ రైడర్స్ కు బలం రాబిన్ ఉతప్ప. సీజన్ లో అత్యధిక రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్న ఉతప్ప.. కోల్ కతా గెలుపుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో మినిమమ్ 40 రన్స్ చేయకుండా ఔట్ కావడం లేదు. ఫైనల్ లో ఉతప్ప చెలరేగితే కోల్ కతాకు తిరుగులేదు. ఇక కెప్టెన్ గంభీర్ కోల్ కతా గెలుపులో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. తనదైన డిసిజన్ మేకింగ్ తో కోల్ కతాకు బలంగా నిలుస్తున్నాడు. ఇక బౌలింగ్ లో సునిల్ నరైన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

ఇక పంజాబ్ గురించి చెప్పాలంటే.. ఈ సీజన్ లో అత్యంత బలమైన జట్టు అనుకోవచ్చు. ప్లే ఆఫ్ చేరే వరకు మ్యాక్స్ వెల్, మిల్లర్, బెయిలీ లాంటి ప్లేయర్లు విరుచుకుపడ్డారు. ఇక స్టార్టింగ్ నుంచి ఆవరేజ్ గా ఆడుతున్న సెహ్వాగ్ క్వాలిఫైయ-2 మ్యాచ్లో సెంచరీతో చెలరేగి.. మిగతా ప్లేయర్లకు రెస్టిచ్చాడు. ఇప్పుడు అందరి హోప్ సెహ్వాగ్ పైనే ఉంది. మ్యాక్స్ వెల్, మిల్లర్ లు ఎప్పట్లాగే చెలరేగితే ఇక పంజాబ్ ను కట్టడి చేయడం కష్టం. బౌలింగ్ లో కూడా జాన్సన్, రాహుల్ శర్మ లు సత్తా చాటు తున్నారు. ఇలా ఒక బలమైన పంజాబ్, సమిష్టి కృషిని నమ్ముకున్న కోల్ కతా లు నేడు బరిలోకి దిగుతున్నాయి. మరి ఐపీఎల్ 7 టైటిల్ ఎవరు గెలుస్తారన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy