ఐపీఎల్ 7 విజేత కోల్ కతా నైట్ రైడర్స్..

ipl7-winners-kolkataఐపీఎల్ 7 లో అందరి ఊహాగానాలు తలకిందులయ్యాయి. అంచనాలు లేని కోల్ కతా, అంచెలంచెలుగా పుంజుకుంటూ కప్ ను ఎగరేసుకుపోయింది. లీగ్ మ్యాచుల్లో విఫలమవుతూ వచ్చిన కోల్ కతా.. మెల్ల మెల్లగా ఒక్కో జట్టును ఓడిస్తూ ఫైనల్ కు చేరింది. సీజన్ లోనే బలమైన జట్టు పంజాబ్ ను ఓడించి ఫైనల్ కు చేరిన తీరు అద్భుతం. క్వాలిఫైయర్ మ్యాచ్ లో కోల్ కతా చేతిలో దెబ్బతిన్న పంజాబ్ ఫైనల్ లో కూడా తలవొంచాల్సి వచ్చింది. ఫైనల్ లో మట్టి కరిపించాలనుకున్నా.. ఆ అవకాశాన్ని పంజాబ్ కు ఇవ్వలేదు నైట్ రైడర్స్. సాహా 115 రన్స్ సహాయంతో పంజాబ్ 200 టార్గెట్ నిర్దేశించినా, పాండే ప్రతాపంతో కోల్ కతా 19.3 ఓవర్లలో చేధించింది. ఉతప్ప, గంభీర్ లాంటి బ్యాట్స్ మెన్ అవుటైనా.. అనూహ్యంగా మనీష్ పాండే 94 రన్స్ తో చెలరేగడంతో పంజాబ్ పై విజయం సాధించింది. పంజాబ్ పై 3 వికెట్ల తేడాతో గెలిచి ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో రెండు సార్లు ఐపీఎల్ కప్ గెలిచిన జట్టుగా కోల్ కతా నిలిచింది.

pandey-kolkataపాండే ప్రతాపం, పంజాబ్ నిర్వేదం :

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా ముందు భారీ స్కోరు.. 200 పరుగుల భారీ లక్ష్యం..! ఛేదనలో కోల్ కతా ఆశలు పెట్టుకున్న ఉతప్ప కేవలం 5 పరుగులకే అవుటై చేతులెత్తేశాడు. కెప్టెన్ గంభీర్ కూడా 23 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఇక పంజాబ్ కు తిరుగులేదని, ఐపీఎల్ 7 పంజాబ్ దేనని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్లుండి మనీష్ పాండే చెలరేగాడు. సీజన్ లో అంతగా ప్రభావం చూపని పాండే ఫైనల్ కొచ్చేసరికి చిచ్చరపిడుగులా చెలరేగాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో విరుచుకుపడి 94 రన్స చేసి కోల్ కతా ను గెలిపించాడు. ఇక  ఈ ఫైనల్ లో పంజాబ్ పడిన శ్రమ వృధా అయ్యింది. సెహ్వాగ్, మ్యాక్స్ వెల్, బెయిలీ, మిల్లర్ లాంటి స్టార్ లు ఆడకపోయినా.. కుర్ర బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహా సెంచరీ చేసి భారీ స్కోరు నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. 55 బంతుల్లో 115 రన్స్ చేసి భలా అనిపించాడు. సాహా సహాయంతో పంజాబ్ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగల్గింది.

ప్రైజ్ మనీ, అవార్డులు :

ఫైనల్ విన్నర్ కోల్ కతా : 15 కోట్లు

రన్నరప్ పంజాబ్ : 10 కోట్లు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్) : మనీష్ పాండే

విలువైన ఆటగాడు : మ్యాక్స్ వెల్

ఆరెంజ్ క్యాప్ : ఉతప్ప ( కోల్ కతా 660 రన్స్),

పర్పుల్ క్యాప్ : మోహిత్ శర్మ( చెన్నై, 23 వికెట్లు),

ఫెయిర్ ప్లే : చెన్నై సూపర్ కింగ్స్

ఎమర్జింగ్ ప్లేయర్ : అక్షర్ పటేల్ (పంజాబ్)

ఉత్తమ క్యాచ్ : పొలార్డ్

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy