ఐఫోన్‌ ధరలు తగ్గుతున్నాయి…

ఐఫోన్‌ టెన్‌, ఐఫోన్‌ 8ప్లస్‌ సహా పలు మొబైల్‌ ధరలను తగ్గిస్తున్నట్లు  ప్రకటించింది యాపిల్‌ కంపెనీ. త్వరలోనే ఈ ధరలను భారత్‌లోనూ అమలు చేయనున్నట్లు తెలిపింది. యాపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌ సిరీస్‌లో మొబైళ్ల ధరను భారీగా తగ్గించింది. ఐఫోన్‌ 7ప్లస్‌ 32జీబీ, 128జీబీ వేరియంట్‌ ధరలు కూడా తక్కువ చేసింది యాపిల్.

ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 32జీబీ మోడల్‌ ధర రూ.52,240 ఉండగా, ఇప్పుడు రూ.34,900లకే లభించనుంది. ఇక ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 128జీబీ వేరియంట్‌ ధర రూ.61,450 నుంచి రూ.44,900కు తగ్గించింది. ఐఫోన్‌ 6ఎస్‌ బేసిక్‌ వేరియంట్‌ రూ.29,900 ప్రారంభమవుతుండగా, హైఎండ్‌ మొబైల్‌ ధరను రూ.39,900గా ఉంది. ఇక ఐఫోన్‌ 7 32జీబీ వేరియంట్‌ను రూ.52,370 నుంచి రూ.39,900లకు తగ్గించింది. అలాగే ఐఫోన్‌7 128జీబీ ధరను కూడా రూ.61,560 నుంచి రూ.49,900లకు తగ్గించింది యాపిల్.

ఐఫోన్‌ 8 ప్లస్‌ ధరను సైతం యాపిల్‌ తగ్గించింది. 64జీబీ ఇక నుంచి రూ.69,900లకే లభించనుంది. గతంలో దీని ధర రూ.77,560గా ఉండేది. ఐఫోన్‌8 ప్లస్‌ 256జీబీ వేరియంట్‌ ధరను రూ.91,110 నుంచి రూ.84,900లకు తగ్గించింది. ఐఫోన్‌ 8 64జీబీ రూ.67,940 ఉండగా, ఇప్పుడు రూ.59,900లకే లభించనుంది. ఐఫోన్‌ 8 టాప్‌ ఎండ్‌ మొబైల్‌ ధరను రూ.81,500 నుంచి రూ.74,900లకు తగ్గించింది. ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.95,390 ఉండగా ఇప్పుడు రూ.91,900లకు లభిస్తోంది. టాప్‌ ఎండ్‌ 256జీబీ వేరియంట్‌ ధర రూ.1,08,930 ఉండగా, ఇక నుంచి రూ.1,06,900 లభించనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy