ఐలయ్య పుస్తకానికి సుప్రీం కోర్టులో ఊరట

KANCHEకంచె ఐలయ్య రాసిన కోమట్లు సామాజిక స్మగ్లర్లు పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీం కోర్టు. పుస్తక శీర్షిక, అందులోని అంశాలు ఒక వర్గాన్ని కించపరిచేలా సమాజంలో అలజడి సృష్టించేవిధంగా ఉన్నాయని సుప్రీంకోర్టును ఆశ్రయించారు పిటిషనర్ వీరాంజనేయులు. పుస్తకాన్ని నిషేధించడం భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకున్నట్టే అని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. రచయితకు చట్ట పరిధిలో తన భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని తెలిపింది ధర్మాసనం. అయితే రచయితలు స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపింది. గతంలో పుస్తకాలు శీర్షికలపై పలు మార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy