ఐసిస్ అంతానికి నడుంకట్టిన మహిళా ఫోర్స్

TO GO WITH AFP STORY BY DELIL SOULEIMANISIS.. ప్రపంచాన్నే వణికిస్తోంది.. అగ్రదేశాలకే ముచ్చెమటలు పట్టిస్తోంది.. అలాంటి తీవ్రవాద సంస్థను ఎదుర్కొనేందుకు మేమున్నాం అంటూ పుట్టికొచ్చింది సరికొత్త సంస్థ… దీని పేరు ఫిమేల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫ్ ది ల్యాండ్ బెట్విన్ టూ రివర్స్. సిరియాలోని సిరియక్ క్రిస్టియన్ కమ్యునిటీ నుంచి వచ్చిన ఈ సంస్థలో అందరూ మహిళలే.. కిరాతకుల పీచమణచటానికి మేము సైతం అంటూ కదనరంగంలోకి దిగుతున్నారు ఈ సంస్థ మహిళలు. తుపాకులు పట్టారు.. షూటింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.. దూకుడుగా దూసుకుపోతున్నారు.  గన్నులు, బాంబులు చేత పట్టి.. పోరుకు రెడీ అవుతోంది. విచిత్రమేమిటంటే.. ఐసీస్ ఏ సిరియాలోనైతే ప్రాణం పోసుకొని ప్రపంచాన్ని గడగడలాడిస్తోందో అదే దేశంలో ఈ ఫోర్స్  రూపుదిద్దుకోవడం. అయితే ఇదేదో అమెరికానో… రష్యానో తయారు చేస్తున్న సైన్యం కాదు. అలాగని కండలు తిరిగిన.. బాడీబిల్డర్ల ఫోర్స్ అసలే కాదు. ఆ సైన్యంలో ఒళ్లో పిల్లలను ఆడిస్తూ సంబరపడిన అమ్మలున్నారు. జాబ్ చేస్తూ.. తమ కాళ్లపై తాము నిలబడిన యువతులున్నారు. చదువుకుంటూ.. హాయిగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న అమ్మాయిలున్నారు. ప్రపంచంపై విషం చిమ్ముతున్న ముష్కరులకు సమాధానం చెప్పడానికి తామే కరెక్ట్ అంటున్నారు వీళ్లందరూ. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను అంతం చేయడానికి నడుం కట్టింది ఆ ఆడాళ్లే. మత చాందసంతో రెచ్చిపోతున్న ఐసిస్ తీవ్రవాదులను అంతం చేయడానికి పిల్లలను, చదువులను, ఉద్యోగాలను పక్కన పెట్టి మరీ పోరుబాటలోకి దిగారు వాళ్లు. ఫిమేల్ ప్రొటెక్షన్ ఫోర్సుగా ఏర్పడిన వీళ్లు.. భవిష్యత్తరాల కోసం… వారి బంగరు భవిష్యత్తు కోసం ఈ పంథాను ఎంచుకున్నామని చెబుతున్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఆగడాలు శ్రుతి మించిపోతుంటే.. అక్కడి క్రిష్టియన్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఆడవాళ్లే.. ఈ సాహసానికి రెడీ అవుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Syriac_Christian_women  (1) Syriac_Christian_women  (2) Syriac_Christian_women  (3) Syriac_Christian_women  (4) Syriac_Christian_women  (5) Syriac_Christian_women  (6) Syriac_Christian_women  (7)

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy