రచయిత్రి ‘మహా శ్వేతాదేవి’కి అస్వస్థత

mahaswetha deviభారతదేశం గర్వించే రచయితల్లో ఒకరైన.. మహా శ్వేతాదేవి  అనారోగ్యంతో బాధపడుతున్నారు. 90 ఏళ్ల  శ్వేతాదేవికి కొంతకాలంగా ఆరోగ్యం బాగోడం లేదు. దీంతో కోల్ కతాలోని ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్వేతాదేవిని పరామర్శించారు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. చెస్ట్ ఇన్ఫెక్షన్ తోపాటు.. శ్వాస తీసుకోవటం కష్టంగా మారటంతో.. బెల్లే వ్యూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. హాస్పిటల్ కు వెళ్లి శ్వేతాదేవిని పరామర్శించారు.

పుట్టింది ఢాకా.. పెరిగింది కోల్ కతా

1926లో బంగ్లాదేశ్ లోని ఢాకాలో పుట్టిన మహాశ్వేతాదేవి.. దేశ విభజన తర్వాత కుటుంబంతో సహా బెంగాల్ వచ్చి స్థిరపడ్డారు. గ్యాడ్యుయేషన్ వరకు ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ లో చదివారు. కోల్ కతా యూనివర్సిటీలో ఎంఏ చేశారు. బిజోయ్ ఘర్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తూనే.. జర్నలిస్టుగా సేవలందించారు.  రచయిత్రిగా తన రచనల ద్వారా సామాజిక న్యాయం కోసం.. పోరాటం చేశారు శ్వేతాదేవి. వెనుకబడిన వర్గాల జీవన సమస్యలతో పాటు.. సమకాలీన జీవన పరిస్థితులను వివరిస్తూ రచనలు చేశారు. ప్రజలను, ప్రభుత్వాలను తట్టిలేపారు.

జ్ఞాన్ పీఠ్.. రామన్ మెగసెసే.. పద్మవిభూషణ్

మహాశ్వేతాదేవి రచించిన హజారీ చౌరాసిమా, అరణ్యేర్ అధికార్, అగ్ని గర్భ, చోటీ ముండా ఎవాం తార్ తీర్, దౌలి, రుడాలి, క్ కోరీస్ డ్రీమ్ వంటివి ఫుల్ ఫేమస్ అయ్యాయి. ఆమె చేసిన సాహితీ సేవకు ఎన్నో కూడా అవార్డులు వరించాయి. 1996లో జ్ఞాన్ పీఠ్, 1997లో రామన్ మెగసెసే, 2006లో పద్మవిభూషణ్ సత్కారాలు పొందారు.

మహాశ్వేతాదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం.. అన్నివర్గాల ప్రజలను బాధకు గురిచేసింది. మహాశ్వేతాదేవిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన మమతా బెనర్జీ 20 నిమిషాల పాటు అక్కడే గడిపారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్వేతాదేవి పరిస్థితి నిలకడగా ఉందని.. మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్లు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy