ఐసెట్ అప్లికేషన్లకు 18వరకు గడువు

icetటీఎస్-ఐసెట్‌ అప్లికేషన్లకు మరో రెండు రోజులు గడువు పెంచారు. ఈనెల 18వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు సుమారు 62వేల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్య రుసుము రూ.500లతో ఈనెల 24 వరకు, రూ.2వేలతో మే 2 వరకు, రూ.5వేలతో మే 8వరకు, రూ.10వేల ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంటుంది. మే 18న ఐసెట్‌ పరీక్ష జరగనుంది. గతేడాది ఆలస్య రుసుము లేకుండా 69,568 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆలస్య రుసుములతో మరో 4250 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy