ఒంటరి మహిళల పెన్షన్లకు అర్హతలివే..

telangana-pensionsరాష్ట్రంలో వృద్ధులను, వితంతు, దైవాంగులతో పాటు ఒంటరి మహిళలకు ఆసరా పథకాన్ని అందించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఒంటరి మహిళలు ఆర్థిక సహాయం పొందాలంటే తమ గ్రామంలోని వార్డు సభలు, సర్పంచ్, తాసీల్దార్, కలెక్టర్ ల అనుమతి పత్రం ఉండాలని చెప్పింది సర్కార్.

ఆర్థికంగా వెనకబడిన బీడీ, కల్లుగీత కార్మికులు ఆసరా పథకాన్ని పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒంటరి మహిళలకు ఆసరా పథకం వర్తింప చేసింది కేసీఆర్ సర్కార్. ఏడాదిపాటు భర్తకు దూరమైనా… లేదా కనిపించకుండా పోయినా..  ఏ ఆధారంలేని ఒంటరి మహిళలు ఫించన్ లకు అర్హులుగా ప్రకటించింది. జోగిని వ్యవస్థలో మగ్గుతున్న మాతమ్మ, జోగిని, బసవి, తాయమ్మ, పార్వతీలు కూడా ఒంటరి మహిళల ఫించన్ పొందవచ్చని చెప్పింది. వీళ్లకు ప్రతి నెల రూ. 1000 ఫించన్ అందించనున్నారు.

ఒంటరి మహిళల ఫించన్ లకు మార్గదర్శకాలు ఇవే…

… 18 ఏళ్లకు పైబడిన ఒంటరి మహిళలు

… ఏడాది పాటు భర్తకు దూరంగా ఉన్న మహిళలు

…  భర్త వదిలేసినా లేదా భర్త కనిపించకుండా పోయినా ఫించన్ పొందవచ్చు

… కుటుంబం లేదా ఆర్థిక తోడ్పాటు లేని ఒంటరిగా జీవిస్తున్న మహిళలు ఆసరా పథకం పరిధిలోకి వస్తారు

… జోగిని వ్యవస్థలో మగ్గుతున్న మాతమ్మ, జోగిని, బసవి, తాయమ్మ, పార్వతి.. తదితర పేర్లతో ఉన్న వాళ్లు కూడా ఒంటరి మహిళలకు ఆసరా పథకం ద్వారా ఆర్థికభృతి కల్పిస్తారు.

… కలెక్టర్ సిఫార్స్ తో యాసిడ్ లేక లైంగిక దాడులకు గురైన బాధిత మహిళలకు ఈ పథకం వర్తింపు.
– ఒంటరి మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న మహిళలు మాత్రమే అర్హులు

… ఇదివరకు ఏ సామాజిక భద్రత పింఛను గానీ, ఎలాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి గాని పింఛను పొందుతున్న వారు కాకూడదు
– ఒంటరి మహిళల ఫించన్ పొందుతున్న మహిళలు మళ్లీ పెళ్లి చేసుకున్నా లేదా ఉద్యోగం పొందినా ఫించన్ పథకం ఆపేస్తారు

.. 65 ఏళ్లు దాటిన తర్వాత ఈ క్యాటగిరి మహిళలు వృద్ధాప్య పింఛను పథకంలోకి వస్తారని తెలియజేసింది సర్కార్

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy