ఒంటిపై 15 కేజీల బంగారం

golden babaసాధారణంగా బాబాలంటే ఎలా ఉంటారు. కాషాయం ధరించి విభూది పెట్టుకుని ఆడంబరాలకు దూరంగా సాధు జీవితం గడుపుతుంటారు. కదా… మరి ఈ పక్క ఫొటోలో ఉన్న బాబాను చూడండి..  ఏంటి షాకయ్యారా. అవ్వాల్సిందే మరి. నిలువెత్తు బంగారం వేసుకుని అలా నడిచొస్తుంటే ఎవ్వరైనా నోరెల్లపెడతారు. చేతివేళ్ల నిండా ఉంగరాలు, ఇదిగో కుడిచేతికి చూశారా ఏకంగా ఓ కవచం చేయించేశాడు. మెడలో దేవతామూర్తులతో బంగారు గొలుసులు. ఈయన నడుస్తుంటే.. జువెలరీ షాపే ఎదురొస్తున్నట్టుంటుంది సీన్.

హరిద్వార్ లో జరుగుతున్న అర్ధకుంభమేళాలో దర్శనమిచ్చాడీ బంగారు బాబా. కుంభమేళాకు వచ్చిన భక్తుల చూపంతా ఈ బాబావైపే. ఒకటా రెండా ఏకంగా 15.5 కేజీల బంగారాన్ని దిగేసుకొచ్చాడు. 3 కోట్ల రూపాయల గోల్డ్ తో ఇలా పబ్లిక్ లో కి వచ్చేశాడు. ఒక్క చేతికి ధరించిన డైమండ్ వాచీ ధరే అక్షరాలా 27 లక్షలు. అంత బంగారంతో గంగానదిలోకి మిగతా భక్తుల చూపంతా బాబా మీదే.

golden baba 12ఇంతకీ ఇతని పేరు చెప్పలేదు కదూ.. సుధీర్ కుమార్ మక్కద్. వయసు 50 ఏళ్లు. సన్యాసం తీసుకోవడానికి ముందు ఢిల్లీలో జువెల్లరీ బిజినెస్ చేసేవాడు. సో అలా ఈ బాబాకు బంగారం అంటే ఇష్టం పెరిగింది. సన్యాసం తీసుకున్నా గోల్డ్ మోజు మాత్రం అలాగే ఉండిపోయింది. బిజినెస్ లో చేసిన కొన్ని తప్పులకు పశ్చాత్తాపంగా సన్యాసం తీసుకుని శేష జీవితాన్ని ఇలా గడుపుతున్నాని చెబుతున్నాడీ బాబా. పేద ప్రజలకు తోచినంత సాయం చేస్తున్నాడట. పేద ఆడపిల్లలకు పెళ్లిళ్లు కూడా చేయిస్తున్నాడట.

సాధువుగా  సేవా కార్యక్రమాలు చేస్తూ గోల్డెన్ బాబాగా ఫేమస్ అయిన సుధీర్ కుమార్ పై కాంట్రవర్శీలు కూడా బాగానే ఉన్నాయి. సన్యాసం తీసుకోకముందు… సుధీర్ మాంచి జల్సారాయుడట. గతంలో స్టేజ్ డ్యాన్స్ షోలలో మహిళలపై డబ్బులు విసిరి ఎంజాయ్ చేసేవాడు. ఇదండీ.. ఈ గోల్డెన్ బాబా కహానీ.. కాంట్రవర్శీలు, కాస్తంత హెల్పింగ్ నేచర్ తో టాఫ్ అఫ్ ది కంట్రీగా మారిపోయాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy