ఒకే ఇన్నింగ్స్ లో వెయ్యిపరుగులు

Pranav-Dhanawade-475-444ప్రపంచ క్రికెట్ లో అరుదైన రికార్డ్. ఒకే ఇన్సింగ్స్ లో వెయ్యిపరుగులు చేశాడు ముంబై క్రికెటర్. 1009 పరుగులతో నాటౌట్ గా నిలిచి క్రికెట్ ప్రంచాన్ని నివ్వెర పరిచాడు. అండర్ 16 క్రికెట్ లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా చరిత్రపుటల్లో నిలిచాడు.  ముంబైలోని కేసీ గాంధీ స్కూల్ కు చెందిన ప్రణవ్ ధన్ వాడే..  116 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆర్థర్ కొల్లీన్స్ 1899లో చేసిన 628 రికార్డును దాటేసి ఒకే ఇన్నింగ్స్ లో వెయ్యిపరుగులు చేశాడు. నిన్న ఒక్క రోజే 199 బంతుల్లో 652 పరుగులు చేశాడు. ఇదీ కూడా ప్రణవ్ ఘనతల్లో ఒకటి. ఒక్క రోజులో 652 పరుగులు చేసి సత్తా చాటుకున్నాడు. ఎంసీఏ నిర్వహిస్తున్న HT బండారీ కప్ లో కేసీ గాంధీ స్కూల్.. ఆర్యగోకుల్ స్కూల్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు ప్రణవ్. ప్రణవ్ తన ఇన్సింగ్స్ లో 78 ఫోర్లు, 30 సిక్సులు బాదాడు. తన ఇన్సింగ్స్ లో 363 బందుల్లో 1009 పరుగులు చేశాడు. మొత్తం 1465 పరుగులు చేసి మ్యాచ్ ను డిక్లేర్ చేసింది కేసీ గాంధీ స్కూల్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బ్రియన్ లారా చేసిన 501(నాట్ ఔట్) కూడా ఇప్పుడీ రికార్డుముందు చిన్నదై పోయింది.  ఈ రికార్డుతో ఫుల్ ఖుషీ అవుతున్నారు ప్రణవ్ తల్లిదండ్రులు. ప్రణవ్ తండ్రీ ఓ సాధారణ ఆటో రిక్షా వాలా. ప్రణవ్ ను ఆర్థికంగా ఆదుకుంటామని ముందుకొచ్చింది మహారాష్ట్ర సర్కార్. అతడికి అయ్యే శిక్షణ ఖర్చులు – చదువులు తాము చూసుకంటామని ప్రకటన చేసింది.

ప్రణవ్ ఆటతీరు 1988లో సచిన్, కాంబ్లీ జంట ఆడిన హరీశ్ షీల్డ్ టోర్నమెంట్ ను గుర్తు చేశారంటున్నారు క్రికెట్ పండితులు. ఆ మ్యాచ్ లో సచిన్ – కాంబ్లీ జంట 664 పరుగులు చేసింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy